NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: ప్రాజెక్టులపై సమీక్ష..! కీలక సూచనలు చేసిన సీఎం వైఎస్ జగన్..!!

AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం పోలవరం సహా రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను ఎక్కడా ఆలస్యం చేయవద్దని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి రావాల్సిన బిల్లులపై సమీక్ష జరిపారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు వివరిస్తూ దాదాపు రూ.1600 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి వెంటనే పెండింగ్ బిల్లులు క్లీయర్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలవరంలో స్పిల్ వే కాంక్రీట్ పనుల్లో 91 శాతం పూర్తి అయ్యాయనీ, ఈ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తి అవుతాయని అధికారులు వివరించారు. కాఫర్ డ్యామ్ లో 1.2 రీచ్ లు జూన్ నెలాఖరు నాటికి, 3,4 రీచ్ పనులు జూలై నెలాఖరు నాటికి నిర్ణీత ఎత్తుకు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.

AP CM YS Jagan review on irrigation projects
AP CM YS Jagan review on irrigation projects

Read More: Man Chews Snake: అతను పామును నమిలి మింగేశాడు..! ఎందుకో తెలిసి అందరూ షాక్ అయ్యారు..!!

రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. వంశధారపై నేరడి బ్యారెజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. సంగం బ్యారేజీ పనులు 84 శాతం పూర్తి అయ్యాయనీ, జూలై 31 నాటికి మొత్తం పనులు పూర్తి అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju