NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపి ప్రయాణీకులు .. ఆందోళనలో కుటుంబ సభ్యులు.. సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష

Advertisements
Share

Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 233కి చేరింది. తీవ్రంగా గాయపడిన 900 మందికిపైగా ప్రయాణీకులు వివిధ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది బెంగాల్ కు చెందిన వారే ఉన్నారని ఓ అధికారి తెలిపారు. అయితే ప్రయాణీకుల్లో ఏపికి చెందిన వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. షాలిమార్ నుండి చెన్నై వస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్, యాశ్వంత్ పూర్ నుండి హావ్ డా వెళుతున్న ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ రెండింటిలోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 124 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కువ మంది ప్రయాణీకులు ఏపికి వస్తున్నట్లు రైల్వే అధికారుల వద్ద ఉన్న జాబితా బట్టి తెలుస్తొంది.

Advertisements
Train Accident

 

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ..షాలిమార్, సంత్రగుచ్చి, ఖరగ్ పూర్, బాలేశ్వర్ స్టేషన్ లో ఎక్కిన ప్రయాణీకుల్లో విజయవాడలోని 47 మంది, రాజమండ్రిలో 22 మంది, ఏలూరులో ఒకరు కలిపి మొత్తంగా 70 మంది వరకూ దిగాల్సి ఉంది.  రైలు ప్రమాదంలో ఏపికి చెందిన ప్రయాణీకులు ఉన్న విషయం తెలియడంతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనా స్థలానికి మంత్రి అమరనాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ ల బృందాన్ని పంపించారు. జిల్లా కలెక్టరేట్ లలో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఘటనా స్థలానికి పంపించడానికి అంబులెన్స్ లు సన్నద్దం కావాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులు అలర్ట్ గా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు. రైల్వే అధికారులతో మాట్లాడి ఏపికి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి మనస్థైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Advertisements
CM YS Jagan

హెల్ప్ లైన్ నెంబర్ లు

ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌, రైల్వే శాఖ హెల్ప్‌ లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశాయి. తెలుగు వారి ఆచూకీ కోసం విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లను ప్రకటించారు. విశాఖపట్నం: 0891-2746330, 0891-2744619, విజయనగరం: 0892-2221202, 0892-2221206, శ్రీకాకుళం: 0894-2286213, 0894-2286245, ఒడిశా హెల్ప్‌ లైన్ నంబర్‌: 06782262286, రైల్వే శాఖ హెల్ప్‌ లైన్‌ నంబర్లు: హౌరా 033-26382217, ఖరగ్‌పూర్‌: 8972073925, బాలాసోర్‌: 8249591559, చెన్నై: 044-25330952, పశ్చిమబెంగాల్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్లు: 033-22143526, 033-22535185

ప్రమాదంపై భిన్న కథనాలు

ప్రమాదంపై భిన్న కథనాలు వినిపిస్తున్నారు. స్థానిక రైల్వే అధికారులు ఒకలా.. రైల్వే అధికార ప్రతినిధి మరొలా చెబుతున్నారు. తొలుత బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంతపూర్ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ పట్టాలు తప్పిందని, తర్వాత కోరమాండల్, గూడ్స్ ఢీకొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. తొలుత కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ పట్టాలు తప్పిందని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. దాని బోగీలు బెంగళూరు-హౌరా సూపర్‌ ఫాస్ట్‌ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు.


Share
Advertisements

Related posts

హైదరాబాద్ లో ఫార్ములా – ఈ రేసింగ్ .. సెలబ్రిటీల సందడి

somaraju sharma

వైవీ 14 నెలలు..! వివాదాలు – విజయాలు (పార్ట్ – 2)

Special Bureau

“కాంతార” లో ఏముంది..!? ఇండియన్ సినీ సెన్సేషన్: తెలుగు మరక !

Special Bureau