AP CM YS Jagan: ఏపిలో భారీ టూరిజం ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!!

Share

AP CM YS Jagan: పర్యాటక రంగానికి ఏపి చిరునామాగా మారాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై బోర్డు సమావేశంలో చర్చించారు. పలు ప్రతిపాదనలకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఒక్కో ప్రాజెక్టు పై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, వివిధ ప్రాజెక్టులపై మొత్తం రూ.2,868.60 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్ఐపీబీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,564 గదులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. రాబోయే ఐదు సంవత్సరాల్లో 1,564 గదులను పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 48వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.

AP CM YS Jagan review state investment promotion board
AP CM YS Jagan review state investment promotion board

AP CM YS Jagan:  ఆమోదం పొందిన కీలక ప్రాజెక్టుల వివరాలు..

  • ఒబెరాయ్ విల్లాస్ బ్రాండ్ పేరుతో రిసార్టులకు ఆమోదం. దీనిలో భాగంగా విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో రిసార్టులు నిర్మించనున్నారు.
  • విశాఖ శిల్పారామంలో నిర్మాణాలకు ఆమోదం
  • హయత్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాలకు ఆమోదం
  • తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖలో హోటల్, అపార్ట్‌మెంట్ కు ఆమోదం
  • విశాఖ టన్నెల్ అక్వేరియం స్కైటవర్ నిర్మాణానికి ఆమోదం
  • విజయవాడలో హయాత్ ప్యాలెస్ హోటల్ నిర్మాణానికి ఆమోదం
  • పెరుగొండ ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో అధ్యాత్మిక పర్యాటక కేంద్రం

 

పర్యాటక రంగానికి ఏపి చిరునామా కావాలి

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి ఏపి చిరునామాగా మారాలని అన్నారు. టూరిజం అంటే ఏపి వైపు చూసే విధంగా ఉండాలన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలన్నారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలన్నారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల పర్యాటక రంగ పరంగా రాష్ట్ర స్థాయి పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడే వారికి మెరుగైన అవకాశాలు వస్తాయన్నారు. విశాఖపట్నంలో లండన్ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూర జయరాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Share

Related posts

తెలంగాణ పదో తరగతి ఎక్సమ్స్ ఎప్పుడంటే ?

Siva Prasad

YSRCP – TDP : ఆత్మస్థైర్యం… టీడీపీకీ వైసీపీకి తేడా ఇదే..!!

Srinivas Manem

ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తున్నారా..? ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క గుర్తుంచుకోండి..!

Srikanth A