NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశంలోనే అతి పెద్ద కుంభకోణం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేసిన సీఎం జగన్  

Share

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణమని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపి అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పై చర్చ జరిగంది. ఈ సందర్భగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ విద్యార్ధుల పేరుతో జరిగిన అతి పెద్ద స్కామ్ ఇది అని అన్నారు. స్కీల్ పేరిట గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుందన్నారు. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. ఓ వ్యక్తి ఏసీబీకి ఇచ్చిన రాత పూర్వక ఫిర్యాదుతో ఈ స్కామ్ బయటపడిందన్నారు. చంద్రబాబు స్కిల్ కు వందల కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆయన మనుషులు రూ.370 కోట్లు తినేశారన్నారు. అనేక షెల్ కంపెనీల ద్వారా డబ్బులు చేతులు మారి మనీ లాండరింగ్ జరిగి వీరి చేతుల్లోకి వచ్చిందని జగన్ తెలిపారు.

cm jagan

 

2018 జూన్ లో అంటే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఒక వ్యక్తి ఏసీబీకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ గురించి వెలుగులోకి వచ్చిందని జగన్ చెప్పారు. ఆ ఫిర్యాదుపై ఏసీబీ విచారణ మొదలు పెట్టారని జగన్ సభకు వివరించారు. కానీ ఆ తర్వాత వారికి వచ్చిన ఆదేశాల మేరకు వారు ఆ ఫైల్ ను పక్కన పెట్టారనీ, అంటే వారిని ఎవరు అపారు అనే విషయం తెలియాల్సి ఉందన్నారు జగన్. ఇది జరిగిన వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నోట్ ఫైల్ అన్నీ మాయం చేశారని జగన్ తెలిపారు. ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక పొరపాటును చేస్తాడని, కాబట్టి వివిధ శాఖల్లోని షాడో ఫైల్ ద్వారా మేము ఈ తతంగాన్ని మొత్తం తవ్వడం ప్రారంభించామని జగన్ వివరించారు.

ఈ స్కామ్ ఎలా జరిగింది అంటే.. వంద రూపాయల పని చేస్తామని చెప్పి రూ.10 లు అడ్వాన్స్ గా తీసుకుని దాన్ని కూడా దొచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందో ఈ స్కామ్ కూడా అలానే ఉంటుందన్నారు. విదేశీ లాటరీ తరహాలో స్కామ్కు పాల్పడ్డారన్నారు.  అమెరికాలో కానీ, యూరప్ లో గానీ మీకు లాటరీ తగిలింది. పది మిలియన్ డాలర్లు మీ పేరు మీద వచ్చాయి. అర్జెంట్ గా మీరు రూ.10లక్షలు డబ్బు కట్టండి. అది కడితే మీకు అమెరికా లో లాటరీ తగిలిన పది మిలియన్ డాలర్లు వస్తాయని చప్పి ఆ పది లక్షల కట్టించుకుని వాటిని కూడా ఎత్తేసే కార్యక్రమం ఏ మాదిరిగా జరుగుతుందో అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ సీమెన్స్ పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని జగన్ పేర్కొన్నారు. ఈ స్కామ్ మన సీఐడీతో మొదలు పెడితే జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఇన్ కమ్ ట్యాక్స్, ఈడీ ఇలా ఏజన్సీలన్నీ దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు.

వైసీపీ ఎంపీ మాగుంటకు మరో సారి ఈడీ నోటీసులు


Share

Related posts

టీడీపీ పొలిట్‌బ్యూరో పదవికి గల్లా అరుణ రాజీనామా

Special Bureau

Astrology signs: ఈ రాశులలో లో పుట్టిన వారు స్త్రీ  లను  ఎక్కువగా ఆకర్షిస్తారు!! (పార్ట్-2)

siddhu

‘కిడ్నాపర్ ప్లాన్’ను ప్లాప్ చేసిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Teja