అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనపై జగన్ సర్కార్ సీరియస్ యాక్షన్

Share

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఫ్యాక్టరీ తెరవకూడదని ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు మెరుగైన వైద్యం అందిలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా అచ్యుతాపురం సెజ్ లో గ్యాస్ లీకైన ఘటన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి గుడివాడ అమరనాథ్ బుధవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి అమరనాథ్ మీడియాతో మాట్లాడుతూ .. గతంలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరుగుతుండగానే మరో సారి ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. సీడ్స్ కంపెనీలో 121 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. బాధితులను అయిదు ఆసుపత్రుల్లో జాయిన్ చేసి వైద్యసేవలు అందిస్తున్నామనీ, బాధితుల్లో ఎవరికీ ప్రాణపాయం లేదని తెలిపారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వెల్లడించారు.

 

ప్రాధమిక విచారణలో కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు తేలిందనీ, జరిగిన ప్రమాదంపై నమూనాలు ఐసీఎంఆర్ కు పంపుతున్నట్లు తెలిపారు. జరిగిన తప్పు పనరావృత్తం కాకుండా సీడ్స్ కంపెనీ చూసుకోవాలని అన్నారు. ప్రస్తుత ప్రమాదంపై ఉన్నత సాథయి కమిటీ విచారణ కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అచ్యుతాపురం సెజ్ లో గ్యాస్ లీక్ ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది అస్వస్థతకు గురవుతున్న ఘటనపై టీడీపీ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు. గత నెలలో జరిగిన ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

36 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

45 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago