టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. శుక్రవారం అమలాపురం మండలం జనుపల్లిలో వైఎస్ఆర్ నాలుగో విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేశారు సీఎం జగన్. అర్హత గత 9.48 లక్షల స్యయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్క చెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమం జరుపుకుంటున్నామన్నారు. నాలుగున్నరేళ్లలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేస్తున్నామన్నారు.
ఇదే సందర్భంలో ప్రతిపక్షాలపైనా విమర్శలు గుప్పించారు సీఎం జగన్. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదే.. నారా వారిదేనని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కుతోచడం లేదనీ, ప్రతిపక్షాల మైండ్ లో ప్యూజులు కూడా ఎగిరిపోయాయాయని అన్నారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హమీ ఇచ్చి రుణాలు మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నడిరోడ్డు మీద నిలబెట్టారన్నారు. చంద్రబాబు అరచకాలు చూస్తుంటే బాధ అనిపిస్తుందన్నారు. 2016లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని, చంద్రబాబు చేసిన మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్ కు దిగజారాయన్నారు.
ఇన్ని పథకాలు చంద్రబాబు హయాంలో ఉన్నాయా అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదని అన్నారు. ఇలాంటి చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం దత్తపుడ్రుడు పరుగులు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తాడట, ఇందు కోసమే చంద్రబాబుకు అధికారం ఇవ్వాలట, చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించాడన్నారు. మైనార్టీ ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నాడని అన్నారు. ఎస్సీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదన్నారు.
చంద్రబాబు మాటంటే విలువలేదు, విశ్వసనీయత లేదు వారికి కావాల్సింది దోచుకోవడం, పంచుకోవడమేనని విమర్శించారు. మొన్న పుంగనురు ఘటన చూస్తే చాలా బాధ అనిపించిందన్నారు. ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. ఒక రూట్ లో పర్మిషన్ తీసుకుని ఇంకో రూట్ లో వెళ్లాడన్నారు. 47 మంది పోలీసులకు గాయాలు చేశారన్నారు. చంద్రబాబు అరాచకంతో ఒక పోలీస్ కన్ను పోగొట్టారన్నారు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడటం లేదని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారన్నారు. మీ బిడ్డకు మీరే ధైర్యం, మీకు మేలు జరిగితే మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని కోరారు సీఎ జగన్.
YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల .. విలీనంపై కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు..?