ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఇదీ ఏపిలో పారిశ్రామిక అభివృద్ధి

Share

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క భారీ పరిశ్రమ రాలేదు. పెట్టుబడి పెట్టే పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపిలో పారిశ్రామిక అభివృద్ధి గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెట్ లో మంగళవారం ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్.. మరో ఎనిమిది కంపెనీలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. ఈ మూడేళ్లలో ఏపికి 17 భారీ పరిశ్రమల ద్వారా రూ.39,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రానున్నాయన్నారు.

 

మూతపడిన ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు చేయూతనిస్తున్నామనీ, రూ.1,463 కోట్లతో ఎంఎస్ఎంఈల పునరుద్దరణకు ప్రోత్సహాకాలు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లలో గా అవార్డులు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం కారణంగా ఆదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని అన్నారు. విశాఖలో రెండు నెలల్లో ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటు కానున్నదని చెప్పారు. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.

 

పారిశ్రామిక అభివృద్ధి వల్ల స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష వరకూ చిన్న, మథ్యతరహా పరిశ్రమలు ఉన్నాయన్నారు. తొమ్మిది హార్బర్ లు నిర్మాణంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపి ఒక్కటేనని పేర్కొన్నారు.  వచ్చే నెలలో టాటా కంపెనీకి చెందిన పరిశ్రమ విశాఖపట్నంలో ప్రారంభమవుతుందని చెప్పారు. మరిన్ని పెట్టుబడులు రావాలంటే ప్రజలు కూడా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలన్నారు.

 


Share

Related posts

Kajal : మరో సీనియర్ హీరో ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్న కాజల్..??

sekhar

The family man 2 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ మీదే సమంత బాలీవుడ్ ఎంట్రీ డిసైడయిందా..?

GRK

Gold Thief: ఐస్ క్రీమ్ తో పాటు 35 గ్రాముల బంగారాన్ని మింగేశాడు.. అసలేం జరిగిందంటే..!!

bharani jella