24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గ్రానైట్ పరిశ్రమలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం వైఎస్ జగన్

Share

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని చిన్న గ్రానైట్ పరిశ్రమలకు గుడ్ న్యూస్ అందించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు చీమకుర్తి మెయిన్ రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ఇద్దరు మహనుభావుల విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని విష్కరిస్తున్నట్లు చెప్పారు. గాంధీ, అంబేద్కర్, పూలే, ఆల్లూరి, ప్రకాశం, వైఎస్ఆర్ .. ఇలాంటి మహానీయులను ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారనీ, భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు.

 

రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందన్నారు. ఆరోగ్య శ్రీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు వైఎస్ఆర్ దేనన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేదలకు చదువులు అందించారన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన 95 శాతం హామీలను నెరవేర్చామన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులను అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకు మేలు చేసే ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టు మొదటి టెెన్నెల్ ఇప్పటికే పూర్తి అయ్యిందన్నారు. ప్రాజెక్టు రెండో టెన్నెళ్ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.  2023 సెప్టెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు ను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించిన సీఎం జగన్, ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాతే ఎన్నికలకు వెళతామన్నారు. గ్రానైట్ పరిశ్రమలకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్న సీఎం జగన్.. మళ్లీ స్లాబ్ విధానం తీసుకువస్తామని చెప్పారు. ఏడు వేల యూనిట్లకు లబ్దిచేకూరేలా జీవో జారీ చేశామని వెల్లడించారు సీఎం జగన్. చిన్న గ్రానైట్ పరిశ్రమల్లో కరెంటు చార్జీలను యూనిట్ కు రూ.2లు తగ్గిస్తామని సీఎం చెప్పారు. ప్రభుత్వ నూతన విధానం వల్ల చిన్న పరిశ్రమలు బాగుపడతాయన్నారు. కొత్త విదానం వల్ల కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు.

 

జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విజ్ఞప్తి మేరకు ఒంగోలు లో శిధిలావస్థలో ఉన్న కొత్త పరిషత్ కార్యాలయం కోసం రూ.20 కోట్లు మంజూరు చేయడంతో పాటు తుళ్లూరు మండలంలోని శివరాంపురం లో ఉన్న మొగిలిగుడ్ల చెరువును మినీ రిజర్వాయిర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్ గా మారుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు.


Share

Related posts

సీబీఐ నోటీసుల నేపథ్యంలో తండ్రి కేసిఆర్ ను కలిసిన తనయ కవిత

somaraju sharma

రాజమౌళి ని మించిపోయే దర్శకులు వీళ్ళు..అందరు కలిసి చెక్ పెట్టబోతున్నారా ..?

GRK

జయసుధతో తెలంగాణ బీజేపీ మంతనాలు..చేరికపై జయసుధ కండీషన్లు ఇవి

somaraju sharma