ఉత్తరాంధ్ర కు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరింత శోభాయమానంగా నిలుస్తుందని ఏపి సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ .. 26 నుండి 30 నెలల్లోపు ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి అవుతుందని జగన్ తెలిపారు. రెండు రన్ వేలతో ఏర్పాటు అవుతున్న ఈ భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన చేయడాన్ని కూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. ఒకే సారి ఇరవై రెండు విమానాలు ఆగేలా, ఎగిరేలా ఎయిర్ పోర్టు రూపుదిద్దుకుంటుందని జగన్ తెలిపారు.

అన్నింటినీ అధిగమించి, అన్ని అనుమతులు తీసుకుని తాము శంకుస్థాపన చేశామని, ఇక భోగాపురం ఎయిర్ పోర్టు పనులు శరవేగంగా పూర్తి అవుతాయని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అబివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇటీవలే మూలపేట లో పోర్టుకు శంకుస్థాపన చేశామన్నారు. ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుందన్నారు. తారకరామ తీర్ధ సాగర్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నామన్నారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని రాబోయే రోజుల్లో ఉత్తరాంద్ర జాబ్ హాబ్ గా మారనుందని పేర్కొన్నారు.
ఆదానీ డేటా సెంటర్ తో ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారుతుందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టును 2026 లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడని చెప్పారు. కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేయలేదని చెప్పుకోచ్చారు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు పూర్తి చేశామనీ, జూన్ నెలలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానిక తేడాను ప్రజలు గమనించాలని కోరారు.
కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఇచ్చాపురం, పలాస వంటి ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని జగన్ తెలిపారు. ఈ జూన్ నెలలోగా తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. విశాఖ అందరికీ ఆమోదయోగ్యమైన నగరమని జగన్ అన్నారు. ఉత్తరాంధ్ర వలసలు అరికట్టేందుకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తాను కూడా సెప్టెంబర్ నుండి విశాఖలోనే కాపురం పెడతానని జగన్ పునరుద్గాటించారు.
సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు బిగ్ రిలీఫ్ .. టీడీపీకి బిగ్ షాక్