NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం వైఎస్ జగన్ పర్యటన .. ఇళ్లు కోల్పోయిన వారికి ఎంత ఇవ్వనున్నారంటే..?

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలోని వరద ముంపునకు గురైన గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ తక్షణ సాయం, నిత్యావసర వస్తువులు అందాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంలో బాధిత కుటుంబాలు తమకు ప్రభుత్వం నుండి తక్షణ సాయం అందిందనీ, నిత్యావసర వస్తువులు అందించారనీ, అధికారులు, వాలంటీర్లు సేవలు అందించారని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ .. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పని చేశారని ప్రశంసించారు. వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొందని చెప్పారు. ఇంత పారదర్శకంగా గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఎన్యుమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని సీఎం జగన్ తెలిపారు.

ఇళ్లు కోల్పోయిన వారికి పది వేలు సాయం

వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10వేల ఆర్ధిక సాయం ఇవ్వాలని అదేశించామని సీఎం జగన్ తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ లోనే సాయం అందిస్తామని చెప్పారు. గోదావరి వరద పరిస్థితులను ప్రధాన మంత్రి మోడీకి వివరిస్తామని, తక్షణం సాయం అందించాలని కోరతామన్నారు సీఎం జగన్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ముంపు ప్రాంతాల పునరావాస ప్యాకేజీ నిధులకై కేంద్రానికి పలు మార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందని చెప్పారు. ఏలూరు జిల్లా తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను పరామర్శించిన తర్వాత సీఎం జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. ఈ పర్యటనలో మంత్రులు చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ, గుడివాడ అమరనాథ్, కారుమూరు నాగేశ్వరరావు తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?