ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం (ఈరోజు) మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఖరారు అయిన నేపథ్యంలో నిన్న రాత్రికే సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి సీఎం అధికారిక నివాసంలో బస చేసిన జగన్ ఈ రోజు ప్రధానితో సమావేశం కానున్నారు. ఈ ఏడాది ప్రధాన మంత్రితో జరిగే చివరి భేటీ ఇది. గత ఏడాది ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ లభించడంలో కొంత ఇబ్బందులు తలెత్తినా ఈ ఏడాది 2023 సంవత్సరంలో మాత్రం ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రుల ఆపాయింట్మెంట్ లు సులువువా లభించడం, వెంటవెంటనే వారితో సమావేశాలు పూర్తి చేసుకుని ఏపికి తిరిగి రావడం జరిగింది.

ఏపిలో రాజకీయంగా అధికార వైసీపీని బీజేపీ విమర్శలు చేస్తున్నా కేంద్రంలో అధికార బీజేపీతో జగన్, వైసీపీ (కేంద్ర ప్రభుత్వం) సఖ్యతగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందిస్తూనే ఉంది. ఇదే క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కు కీలక బిల్లుల ఆమోదం కోసం అవసరమైన సందర్భాల్లో వైసీపీ సహకరిస్తూ వచ్చింది. ఏపిలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకే అన్ని రాజకీయ పార్టీలు సన్నద్దంగా ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. వైసీపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు జనాల్లో తిరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అధికార వైసీపీ నేతలు, మంత్రులు చెబుతున్నా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో సీఎం జగన్ గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్షలు జరుపుతుండటం, నెలలో రెండు మూడు జిల్లాల పర్యటనలు పెట్టుకుని ఆ సభల్లో ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ప్రజలకు మంచి జరిగింది అని భావిస్తేనే వైసీపీని మళ్లీ ఆశీర్వదించాలని కోరుతుండటం తదితర పరిణామాలు ముందస్తు ఎన్నికలకు సూచనలేనని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి భేటీలో సీఎం జగన్ .. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం ఉంది. .కాగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నారు.
విషాదాన్ని నింపిన విహార యాత్ర .. ఫోటోలు దిగుతుండగా ప్రమాదం..ఆమెరికాలో తెలుగు దంపతులు మృతి..