NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: విద్యార్ధులకు ‘ఆల్ ద వెరీ బెస్ట్’ చెప్పిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంలో తరగతి గదిలో గ్రీన్ బోర్డుపై ఆల్ ద వెరీ బెస్ట్ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్ విద్యార్థులతో ముచ్చటించి పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను పాఠశాల సిబ్బంది సీఎం జగన్ కు వివరించారు. పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని స్వయంగా సీఎం విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్ లను, విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించి మెనూను సీఎం జగన్ పరిశీలించారు.  అనంతరం మనబడి నాడు నేడు ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలాన్ ఆవిష్కరించి సిఎం జగన్ ప్రారంభించారు.

AP CM YS Jagan visits east godavari launch 2nd phase manabadi nadu nedu
AP CM YS Jagan visits east godavari launch 2nd phase manabadi nadu nedu

మన బడి నాడు నేడు ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను అధునీకరించారు. నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న సందర్భంగా సీఎం వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం నాడు నేడు కింద రెండో విడత చేపట్టనున్న పాఠశాలల పనులను సీఎం జగన్ ప్రారంభించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.

అనంతరం జరిగిన సభలో కోవిడ్ నేపథ్యంలో మూత బడిన పాఠశాలలను ప్రారంభించడం జరిగిందన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పాఠశాల తరగతులు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. పాజిటివిటీ రేటు పది శాతం కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలు అన్నీ తెరవాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యావ్యవస్థకు మెరుగుకు తీసుకుంటున్న చర్యలు, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సీఎం జగన్ వివరించారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju