YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 6వ తేదీన చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని చిలకలూరిపేటలో అధికారికంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. చిలకలూరిపేట మండలం తింగంగుంట్ల గ్రామంలో ఆయన ప్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజిని పరిశీలించారు.

సీఎం జగన్ తన నియోజకవర్గానికి వస్తుండటంతో పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడానికి మంత్రి విడతల రజిని యత్నిస్తున్నారు. తమ నియోజకవర్గంలో జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు ఓ పక్క మంత్రి విడతల రజిని, మరో పక్క కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్ లు పోటీపడి తమ కార్యకర్తలను కార్యక్రమానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటునకు ఆ శాఖ అధికారులు సన్నద్దం అవుతున్నారు.
సీఎం జగన్ పర్యనటకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి విడతల రజిని, సిఎం ప్రోగ్రామ్ కమిటీ ఇన్ చార్జి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి పరిశీలన చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి యం టి కృష్ణబాబు, ఆరోగ్య శ్రీ సీఈఓ హరింద్ర, జిల్లా కలెక్టర్ రవిశంకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శోభారాణి తదితర అధికారులతో సమీక్ష జరిపారు.
YS Sharmila: షర్మిల దారి ఎటు – పరీక్ష పెట్టిన ‘బండి’