YSR EBC Nestham: నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తం పథకం కింద 4,39,068 మంది లబ్దిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి రూ.658.60 కోట్ల జమ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరనున్నారు ముఖ్య మంత్రి వైఎస్ జగన్. 9.55 గంటలకు మార్కాపురం కు చేరుకుంటారు సీఎం జగన్. ఎస్ వీ కే పీ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు వైఎస్ జగన్. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.

ఆ తర్వాత ఈబీసీ నేస్తం లబ్దిదారులకు నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు అక్కడి నుండి తాడేపల్లికి బయల్దేరతారు. ఈ పథకం కింద ఆర్ధికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, కాపు తదితర ఓసి సామాజిక వర్గాలు లబ్దిపొందుతున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తొంది. నేడు అందిస్తున్న రూ.658.60 కోట్లతో కలిపి ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు. ఇప్పటి వరకూ ఒక్కో లబ్దిదారులకు రూ.30వేల సాయం అందగా, ఇవేళ మరో రూ.15వేలు వారి ఖాతాలో జమ కానున్నది.
Eluru TDP: బావ వద్దు.. బావమరిదే ముద్దు..!