NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రంలో మూడో సంరంభం..! ఇళ్లపట్టాల వేడుక ఆరంభం..!!

 

పేదల సొంతింటి కల నెరవేరుస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుండి 15 రోజుల పాటు పండుగలా ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామన్నారు. 30లక్షల మందికిపైగా అక్కా చెల్లెళ్లలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండవ దశల్లో 28లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

తాము కడుతున్నది ఇళ్లు కాదనీ ఏకంగా గ్రామాలనే నిర్మిస్తున్నామని అన్నారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 17,500 వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తాము అందిస్తున్న ప్లాట్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అన్నారు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా ఇంటిని అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంట్లో రెండు ఫ్యాన్ లు, రెండు ఎల్ ఈ డీ లైట్లతో పాటు ఇంటిపైన ఒక సింటెక్స్ ట్యాంకు ఉంటుందని చెప్పారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్‌మస్ పర్వదినాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.   కోర్టు స్టే కారణంగా నిలిచిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి సుప్రీం కోర్టు వరకూ వెళ్లి అయినా స్టేలు తొలగింపు చేసి మిగిలిన వారందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని జగన్ అన్నారు.

ఇక్కడ పంపిణీ చేయలేకపోవడం బాధగా ఉంది

పులివెందులలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుండగా పులివెందులలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేకపోవడం ఒకింత బాధగా ఉందన్నారు. ఇక్కడ భూములు పంపిణీ చేయడానికి వీలులేదంటూ ఏవడో కోర్టుకు వెళ్లితే స్టే ఇచ్చిందని అన్నారు. కోర్టు స్టే ఇచ్చినా సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా సరే స్టే వెకేట్ చేయించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించారు జగన్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju