AP CMO: ఏపి సీఎంఒలో కీలక పరిణామాలు..ముత్యాలరాజు ఇన్..! ప్రవీణ్ ప్రకాష్ అవుట్..!!

Share

AP CMO: ఏపి సాధారణ పరిపాలనా విభాగం (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా ముత్యాల రాజు నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఎం ముఖ్య కార్యదర్శిగానూ కొనసాగుతున్న ప్రవీణ్ ప్రకాష్ ను జీఏడి (పొలిటికల్) బాధ్యతల నుండి రిలీవ్ చేశారు. జేఏడీ బాధ్యతలను రేపు ముత్యాల రాజు స్వీకరించనున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంఓ నుండి తప్పించడంపై ఐఏఎస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరగుతున్నది.

AP CMO key changes
AP CMO key changes

ప్రవీణ్ ప్రకాష్ సీఎంఒలో కీలకమైన సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులైన తరువాత సీఎం జగన్ వద్ద ఉన్న పరపతితో సీఎస్‌ను కూడా లెక్కచేయకుండా అన్నీ తానై వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనను సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి నుండి రిలీవ్ చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 


Share

Related posts

రాజధానిపై హైకోర్టులో ముగిసిన వాదనలు..! నవంబర్2కి విచారణ వాయిదా..!!

Special Bureau

చంద్రయాన్-2కు హాల్ట్

Siva Prasad

గోల్ మిస్.. రహీమ్ స్టెర్లింగ్ పై నెటిజన్ల మీమ్స్..!

Varun G