AP credai : మంత్రి బొత్సాను కలిసిన ఏపి క్రెడాయ్ కార్యవర్గ సభ్యులు..! ఎందుకంటే..?

Share

AP credai : ఏపి క్రెడాయ్ కార్యవర్గ సభ్యులు బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణతో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరు మంత్రి బొత్సాతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఒక ఎకరం విక్రయిస్తే ఆంధ్రలో మూడు ఎకరాలు కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రలో భూముల ధరలు తగ్గాయనీ, తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి అన్నట్లుగా కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపిలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్రంలో ఈ పరిస్థితులు రావడానికి కారణం మీరంటే మీరని వైసీపీ, టీడీపీ విమర్శించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపిలో రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న పరిస్థితులపై క్రెడాయ్ ప్రతినిధులు మంత్రి బొత్సా సత్యనారాయణతో చర్చించారు.

AP credai president meets minister botsa

ఏ పి క్రెడాయ్ అధ్యక్షుడు రాజా శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని చెప్పారు. కరోనా కారణంగా సొంత ఇంటి విలువ చాలా మందికి తెలిసి వచ్చిందన్నారు. గత కొద్ది రోజులుగా ఇళ్లు, ప్లాట్ ల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించామని చెప్పారు.

ప్రధానంగా స్టాంప్ డ్యూటీ డిడక్షన్ వల్ల ప్రజలకు ఎంతో భారం తగ్గుతుందని తెలిపారు. సిమెంట్, ఐరన్ ధరలను ఉద్దేశపూర్వకంగా సిండికేట్ అయ్యి పెంచేస్తున్నారనీ ఆయన ఆరోపించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ధరలను నియంత్రించాలని రాజా శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు అమాంతం పెరిగిపోవడంతో నిర్మాణ రంగం సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.


Share

Recent Posts

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

  ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…

6 mins ago

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…

7 mins ago

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

36 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

1 hour ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago