NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CS: ఏపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఎక్స్‌టెన్షన్ రాకుంటే ఈ అధికారే నూతన సీఎస్.!?

AP CS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిత్యనాథ్ దాస్ పదవి కాలాన్ని పొడిగించాలంటూ జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గతంలో నీలం సాహ్నిని మూడు మాసాలు చొప్పున రెండు సార్లు ఎక్స్‌టెన్షన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అదే మాదిరిగా ఆదిత్యనాథ్ దాస్ కు కూడా ఎక్స్‌టెన్షన్ ఇచ్చే అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఆదిత్యనాథ్ దాస్ విషయంలో కొంత సందిగ్దత నెలకొంది. ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని పొడిగించ డం సమంజసం కాదనీ, ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు వేరువేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. గతంలో ఆదిత్యనాథ్ దాస్ పై ఉన్న కేసుల ప్రస్తావన తీసుకువస్తూ వారు కేంద్రానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్ దాస్ ఎక్స్ టెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

AP CS: sameer sharma relieved from central services
AP CS sameer sharma relieved from central services

Read More: Brahmamgari Matam: కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి పంచాయతీ..! 12వ పీఠాధిపతి ఆయనే…!

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసుల నుండి సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మను రిలీవ్ చేయాలంటూ కూడా మరో లేఖ రాయగా వెంటనే స్పందించిన కేంద్రం సమీర్ శర్మ ను కేంద్ర సర్వీసుల నుండి శుక్రవారం రిలీవ్ చేసింది. నేడో రేపో ఆయన సమీర్ శర్మ ఏపి ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు. సమీర్ శర్మను కేంద్ర సర్వీసుల నుండి సిబ్బంది వ్యవహారాల శాఖ రిలీవ్ చేసింది. కేంద్రంలో కార్పోరేట్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ గా సమీర్ శర్మ బాధ్యతల నిర్వహించారు. ఈ నెలాఖరులుగా ఆదిత్యనాథ్ దాస్ ఎక్స్‌టెన్షన్ పై కేంద్రం నుండి సానుకూల నిర్ణయం వెలువడకపోతే సమీర్ శర్మను సీఎస్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. అందు కోసమే రాష్ట్ర ప్రభుత్వం సమీర్ శర్మను కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

AP CS: sameer sharma relieved from central services
AP CS sameer sharma relieved from central services

1987 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆదిత్యనాథ్ దాస్ గత ఏడాది డిసెంబర్ 31న ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మ 1985 ఐఏఎస్ బ్యాచ్ అధికారి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!