ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CS Sameer sharma: సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూల స్పందన…సీఎస్ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగింపు

AP CS Sameer sharma tenure extended another six months
Share

AP CS Sameer sharma: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలం పొడిగించారు. మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం అనుమతి ఇచ్చింది. తాజా పొడిగింపుతో ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకూ సీఎస్ సమీర్ శర్మ బాధ్యతల్లో కొనసాగుతారు. గతంలో సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధనపై కేంద్రం సమీర్ శర్మకి ఆరు నెలల పాటు సర్వీస్ పొడిగించింది. ఈ నెలాఖరున రిటైర్ అవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పై ఇప్పుడు మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్రం అనుమతి ఇచ్చింది.

AP CS Sameer sharma tenure extended another six months
AP CS Sameer sharma tenure extended another six months

ఇంతకు ముందు నీలం సాహ్ని, ఆదిత్యనాథ్ దాస్ లకు మూడు నెలల చొప్పునే పొడిగింపునకు రెండు పర్యాయాలు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఏపిలో మొదటి సారిగా ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సీఎస్ సమీర్ శర్మ నిలిచారు. గతంలో యూపీ, బీహార్ సీఎస్ లకు మాత్రమే కేంద్రం ఆ విధంగా అవకాశం ఇచ్చింది. నీలం సాహ్నికి తొలి సారి ఆరు నెలల పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన పంపితే కేంద్రం పదవీ కాలం మూడు నెలలు మాత్రమే పొడిగిస్తూ ఉత్తర్వలు ఇచ్చింది. ఆ తరువాత మరో మూడు నెలలు పొడిగింపునకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

సమీర్ శర్మ కు మాత్రం ఆరు నెలల చొప్పున రెండు సార్లు ఎక్స్ టెన్షన్ లభించింది. సమీర్ శర్మ 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. సమీర్ శర్మ గత ఏడాది నవంబర్ 30వ తేదీనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆరు నెలల చొప్పున రెండు సార్లు ఎక్స్ టెన్షన్ లభించడంతో ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకూ ఏపీ సీఎస్ గా సేవలు అందించనున్నారు.


Share

Related posts

Mahesh Babu: మహేష్ సినిమాకి కరోనా ఎఫెక్ట్..! ఐదుగురికి కరోనా నిర్ధారణ..!!

bharani jella

Tollywod Director: స్టార్ డైరెక్టర్ పని ఇక అయిపోయిందనుకున్న సమయంలో సాలీడ్ హిట్ తో కమ్ బ్యాక్..అందుకు కారణం వాళ్ళే..!

GRK

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌కి ఆ ఒక్క హిట్టు పడకపోతే ఇక టాలీవుడ్‌లో అడుగుపెట్టదేమో పాపం..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar