CAG Report Truth: రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం..? వైసీపీ ఏం చేసింది – కాగ్ ఏం చెప్పింది..? ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉందా..?

Share

CAG Report Truth: ఏపి అసెంబ్లీలో శుక్రవారం కాగ్ రిపోర్టు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని కంట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) అధ్యయనం చేసి రిపోర్టులను సబ్ మిట్ చేస్తుంటుంది. అయితే ఏపి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికపై నేటి ఈనాడులో ఆర్ధికం – అస్తవ్యస్థం పేరుతో కథనాన్ని ప్రచురించగా, ఆంధ్రజ్యోతిలో ఆర్ధిక విధ్వంసం – తప్పుడు లెక్కలు – రుజువు చేసిన కాగ్ అంటూ మొదటి పేజీలో బ్యానర్ గా ప్రచురించాయి. ఇదే వార్తను సాక్షి లో ఎక్కడో లోపల చిన్న కాలమ్ ఐటమ్ ఇస్తూ ఆ వార్తలో కూడా జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాల ఫలితంగా రాష్ట్రం ఆర్ధికంగా కొంత ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే అని కాగ్ అభిప్రాయపడిందని పేర్కొంది. మూడు పత్రికల్లో వారి వారి ఇష్టమొచ్చినట్లుగా రాసుకున్నా.. అసలు కాగ్ రిపోర్టులో ఏముంది, రాజ్యాంగ సంక్షోభం అన్న మాట వాడారు, నిజంగా అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా?  రాజ్యాంగ సంక్షోభం తలెత్తితో ప్రభుత్వం ఉంటుందా ? అనే విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది.

ap debts at 3-73 lakh crore ap-debts-at-3-73-lakh-crore Cag Report
ap debts at 3-73 lakh crore ap-debts-at-3-73-lakh-crore Cag Report

 

CAG Report Truth: బడ్జెట్ ఆమోదం కంటే

నిజానికి కాగ్ లేవనెత్తిన అంశాల్లో కీలకమైన విషయం ఏమిటంటే శాసనసభలో బడ్జెట్ ఆమోదం జరుగుతుంది. బడ్జెట్ ఆమోదంకు మించి ఖర్చు పెడితే అది రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. దాన్నే కాగ్ గుర్తించింది. 2019 – 20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆమోదం కంటే ఖర్చు ఎక్కువగా జరిగినట్లు గుర్తించి స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వం ఆర్ధిక వ్యవహారాల్లో రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిందని కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2019 – 20 ఆర్ధిక సంవత్సరంలో అనుబంధ పద్దులను వ్యయం చేసి ఆ తరువాత జూన్ 2020 లో శాసనసభలో పెట్టారు. ఇది రాజ్యంగ విరుద్దం. అంటే ముందుగా ఖర్చు చేసి ఆ తరువాత శాసనసభలో ప్రవేశపెట్టారు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్ధిక వ్యవహారాలు జరిగాయి. చట్ట సభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీన పర్చారు. ప్రజా వనరుల వినియోగంలో ఆర్ధిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రదర్శించారు.

 

ఖర్చు తరువాత శాసనసభలో ఆమోదం

శాసనసభ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునరావృత్తం అవుతున్నాయి. అదనపు నిధులు ఆవస్యం అని భావిస్తే శాసనసభ నుండి ముందస్తు ఆమోదం పొందేలా చూసుకోవాలి. ఇవి కాగ్ లోని పాయింట్లు. బడ్జెట్ ఎంత ఆమోదిస్తే ఆ మేరకే ఖర్చు చేయాలి. అదనపు నిధులు అవసరం అయితే శాసనసభలో ఆమోదించి ఖర్చు చేయాలి. కానీ ఏపిలో అలా జరగలేదు, ఖర్చు చేసిన తరువాతే శాసనసభలో ఆమోదించారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కినట్లు అని కాగ్ అభిప్రాయపడింది. 2018 -19, 2019- 20 పోలిస్తే 3.19 శాతం రెవెన్యూ రాబడులు తగ్గాయి. కొత్త సంక్షేమ పథకాల వల్ల 6.93 శాతం రెవెన్యూ ఖర్చు పెరిగింది. రెవెన్యూ లోటు కూడా పెరిగింది. చెల్లించాల్సిన బకాయిలను బడ్జెట్ పత్రాల్లో సక్రమంగా చూపలేదు. శాసన వ్యవస్థను నీరుగార్చే విధంగా ఆర్ధిక నిర్వహణ ఉంది అని కాగ్ చెప్పింది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని కాగ్ స్పష్టం చేస్తుంది. అయితే దీనిపై యాక్షన్ ఎవరు తీసుకుంటారు. కేంద్రం, ఆర్బీఐ వీటిపై స్పందించదు. అయితే ఇది ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమీ కాదు. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి.


Share

Related posts

Immunity Power : ఈ అన్నాన్ని తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది !!

Kumar

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కృష్ణమ్మ కళకళలు

somaraju sharma

Triphala Tea: త్రిఫలా టీ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!!

bharani jella