YSRCP: జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే.. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఆ ఉప ముఖ్యమంత్రి..!!

Share

YSRCP:  ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు అవునన్నా కదన్నా నూటికి నూరు శాతం నిజమే. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా అప్పులు తెచ్చీ మరీ నవరత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి విషయాన్ని పక్కన బెడితే వివిధ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా డబ్బుల పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా చూసుకుంటే ఏపి ప్రధమ స్థానంలో ఉంటుంది.

ap dy cm darmana comments on YSRCP Govt

 

అయితే జగన్ సర్కార్ పై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందనీ, పలు జిల్లాల్లో వైసీపీ నేతల మధ్యే విభేదాల కారణంగా ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని వార్తలు వినబడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక వేళ ప్రభుత్వ రాబోయే ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేకతతో కొన్ని స్థానాలు కోల్పోయినా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో 90కి పైగా స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంటుదని ఆ పార్టీ నేతల్లో బలంగా ఉంది.

YSRCP: Some Leaders Trouble to Face Jagan

YSRCP: రాజకీయ సన్యాసం తీసుకుంటా

వైసీపీ విభేధాలు రచ్చకెక్కాయనీ, రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదనీ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఉప ముఖ్యమంత్రి దర్మాన కృష్ణదాస్ స్పందించారు. ఈ సందర్భంలో ఆయన ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. జగన్ ఒక వేళ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు ధర్మాన కృష్ణదాస్. టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడు ఎప్పుడూ మంచి వాళ్లకు తోడు ఉంటాడనీ అందుకే గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రజలు, మహిళల సహకారంతో మళ్లీ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వస్తుందని ధర్మాన స్పష్టం చేశారు. వైసీపీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు.

Read More: 1. JP Nadda: హైదరాబాద్ నడిబొడ్డులో..కేసిఆర్ కి వణుకు తెప్పించే ప్రకటన చేసిన జేపి నడ్డా..

2.Mudragada Padmanabham: ముద్రగడ సరికొత్త నిర్ణయం.. జగన్ మీద రివర్స్ అవ్వబోతున్నాడా..!

3.AP Employees JAC: ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట..? సంక్రాంతి పండుగ తరువాత మరింత సీరియస్‌గా…

 


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

18 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago