NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏమన్నారంటే..?.

AP Inter Exams: ఏపిలో షెడ్యుల్ ప్రకారం మే 5వ తేదీ నుండి 23వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. జేసి, ఆర్ఐఓ, డీఇఓలతో మంత్రి సురేష్ మాట్లాడారు. అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్ పై జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలన్నారు.

ap education minister adimulapu suresh comments on inter exams
ap education minister adimulapu suresh comments on inter exams

ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదనీ, కొన్ని చోట్ల నిర్వహిస్తుండగా, మరి కొన్ని చోట్ల వాయిదా వేశారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పరీక్షలను అనవసరంగా రాద్ధాంతం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్, కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేసే ఉద్దేశం లేదన్నట్లు నిర్ణయాన్ని స్పష్టం చేసింది. పరీక్షల ఏర్పాట్లకు అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju