AP Employees JAC: రేపు సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ..? సంక్రాంతికి గుడ్ న్యూస్ ఖాయమే..!!

AP Employees JAC to meet cm jagan tomorrow
Share

AP Employees JAC: పీఆర్సీతో సహా 70 డిమాండ్ల పై ఏపి ఉద్యోగ సంఘాలు మరో మారు ఆందోళనకు సన్నద్దం అవుతున్న నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుందట. సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు తీపి కబురు అందించనున్నది. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందనీ, ఈ నెల 9వ తేదీన కార్యవర్గ సమావేశం జరిపి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని సంఘాల నేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. సీఎం అపాయింట్మెంట్ అయినా అధికారులు ఇప్పిస్తే తమ ఆవేదన చెప్పుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రేపు ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు సమాచారం అందినట్లు సమాచారం. సంక్రాంతి పండుగకు ముందే పీఆర్సీ ప్రకటించి ఉద్యోగ కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.

AP Employees JAC to meet cm jagan tomorrow
AP Employees JAC to meet cm jagan tomorrow

 

AP Employees JAC: ఉద్యోగ సంఘాలతో రేపు సమావేశం

సీఎం జగన్ రేపు ఉద్యోగ సంఘాలతో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్ధిక శాఖ అధికారులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలోనే పీఆర్సీపై జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. పీఆర్సీ పై గత కొద్ది రోజులుగా జగన్ సర్కార్.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఫిట్ మెంట్ ఎంత ఇవ్వాలన్నదానిపైనే చర్చలు జరిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తొలుత ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గత నెలలో ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ తో ఉద్యోగ సంఘాల సమావేశం అయితే తమ సమస్యలపై స్పష్టత వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.

Read More: 1. YS Sharmila Party: ఏపిలో షర్మిల పార్టీ..? అసలు క్లారిటీ ఇచ్చేసిన ఆ పార్టీ ముఖ్యనేత..!!

2. JP Nadda: హైదరాబాద్ నడిబొడ్డులో..కేసిఆర్ కి వణుకు తెప్పించే ప్రకటన చేసిన జేపి నడ్డా..

3. YSRCP: జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే.. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఆ ఉప ముఖ్యమంత్రి..!!


Share

Related posts

Job Notification: సీఏపీఎఫ్ -2021 నోటిఫికేషన్..!!

bharani jella

సీఎం జగన్ ,మంత్రి పెద్దిరెడ్డి లపై దళిత జడ్జి సంచలన వ్యాఖ్యలు!బాగా ముదిరిపోతున్న మేటర్ !!

Yandamuri

లాక్ డౌన్ కొనసాగింపు పై కెసిఆర్ ప్రెస్ మీట్

Siva Prasad