AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

Share

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి సొమ్ము విత్ డ్రా కావడంపై నేతలు ప్రశ్నించారు. దీనిపై ఇది ఎలా జరిగిందో తెలియడం లేదనీ, దీనిపై విచారణ చేసి స్పష్టత ఇస్తామని అధికారులు ఉద్యోగ సంఘాల నేతలకు సమాధానమిచ్చారు. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామనీ, కింద స్థాయి అధికారుల నుండి నివేదిక తెప్పించుకుని సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు జమ చేయడం, విత్ డ్రా చేయడంపై సీఎఫ్ఎంఎస్ లో సాంకేతిక సమస్య ఉండవచ్చనీ, జరిగిన పొరపాటుకు సంబంధించి అధికారుల నుండి వివరణ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

AP Employees leaders meet finance department

 

ఆర్ధిక శాఖ అధికారిని కలిసిన తరువాత బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ సీఎఫ్ఎంఎస్ లో జరిగిన పొరపాటును ఆర్ధిక శాఖ అధికారులు అంగీకరించారని తెలిపారు. ఆందోళన చెందవద్దనీ, సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 90వేల ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతా నుండి వారికి తెలియకుండానే రూ.800 కోట్ల మాయం అయ్యాయని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ నిన్న వెల్లడించారు. దీనిపై అన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేస్తామన్నారు.

అయితే ఇతర ఉద్యోగ సంఘాల నేతలు సూర్యనారాయణ ప్రతిపాదనను వ్యతిరేకించారు. సమస్య ఎదురైనప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలి కానీ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.  గతంలోనూ ఇదే విధంగా జీపీఎఫ్ ఖాతాలో నిధులు మాయం కాగా ఉద్యోగ సంఘాల నేతలు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తిరిగి జీపీఎఫ్ ఖాతాలకు నగదు జమ చేశారు.


Share

Recent Posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆప్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం…

6 నిమిషాలు ago

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

10 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

12 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

3 గంటలు ago