AP Employees Shocked: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతాల నుండి మరో సారి నిధులు మాయం అయ్యాయి. గతంలోనూ జీపీఎఫ్ ఖాతాల్లో నగదు ఉద్యోగులకు తెలియకుండానే మాయం అయితే ఫిర్యాదు చేస్తే తిరిగి వేశారు. ఇప్పుడు మరో సారి మొత్తం 90 వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ ఖాతాల నుండి 800 కోట్ల రూపాయలు డెబిట్ అయ్యాయి. ఈ విషయాన్ని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ మంగళవారం మీడియాకు తెలిపారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్లు గత రాత్రి నుండి మెసేజ్ లు వచ్చాయన్నారు సూర్యనారాయణ. తన వ్యక్తిగత ఖాతా నుండి రూ.83వేలు విత్ డ్రా చేశారని ఆయన చెప్పారు. జీపీఎఫ్ ఖాతాల్లో నగదు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తామన్నారనీ, గడచిన ఆరు నెలలుగా ఇచ్చిన డీఏ బకాయిలు మళ్లీ వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు సూర్యనారాయణ.
జీపిఎఫ్ ఖాతాలో నగదు విత్ డ్రా అంశంపై ఆర్ధిక శాఖకు ఫిర్యాదు చేయడానికి వెళితే అధికారులు అందుబాటులో లేరని సూర్యనారాయణ తెలిపారు. ఇవి ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా లేక ఉన్నతాధికారుల తప్పిదమో తెలియడం లేదని అన్నారు. ఉద్యోగుల అనుమతి లేకుండా వారి ఖాతాలోని సొమ్ము విత్ డ్రా చేయడం నేరమని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు సూర్యనారాయణ. ఇదే సందర్భంలో మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు సూర్యనారాయణ. ఆర్దిక శాఖలోని సీఎఫ్ఎఎస్ లో ఉన్న సీపీయూ యూనిట్ వద్ద తమ వేతన ఖాతాల నుండి విత్ డ్రా చేసే సాంకేతికత ఉందనీ, ఇది ఎంత వరకు చట్టబద్దమని ఆయన ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు సూర్యనారాయణ.
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…