NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Balineni Srinivasa Reddy: ఏపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni Srinivasa Reddy: ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హజరైన బాలినేని ప్రస్తుత రాజకీయాలు, తెలంగాణ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50లక్షలు పందెం పెట్టానని చెప్పారు. అయితే తెలంగాణలోని పలు జిల్లాల్లో తిరిగి మా అబ్బాయి బీఆర్ఎస్ వస్తుందని ప్రచారం చేశాడనీ, తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే ఏపీలో వైసీపీ వస్తుందని మా అబ్బాయి తపన పడ్డాడని చెప్పారు.

మా అబ్బాయి బాధపడకూడదని, డబ్బులు వస్తాయని తెలిసినా పెట్టిన పందెం క్యాన్సిల్ చేసుకున్నానని బాలినేని పేర్కొన్నారు.  30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాననీ,  ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే  విరక్తి పుడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మాట్లాడితే బాధపడుతూ మాట్లాడుతున్నానని అంటున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు కులాల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓ కులం రోడ్డు మీదకు వచ్చి పని చేస్తారని, దీన్ని అందరం సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యకర్తలు అందరూ హార్ట్ ఫుల్ గా పని చేస్తానంటే తాను పోటీ చేస్తా.. లేదంటే చేయనని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. తాను ఒంగోలు విడిచి వేరే చోట పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. మరో సారి ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఒంగోలులో 25వేల ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతే పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పాననీ, అయితే ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఆ సమస్య లేదన్నారు.

అయిదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేశాననీ, కొత్తగా వచ్చేది పోయేదీ ఏమీ లేదని అన్నారు బాలినేని. తాను నీతి మంతుడిని అని చెప్పడం లేదనీ, మంత్రిగా ఉన్న సమయంలో బయట ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నానని అన్నారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించిన నాయకులు ఇలా డబ్బులు తీసుకున్నాను, పందెం వేశాను అని మాట్లాడటం విమర్శలకు దారి తీస్తున్నాయి. గతంలోనూ పలు సందర్భాల్లో బాలినేని చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. బెట్టింగ్ లకు పాల్పడటం, జూదం, డబ్బులు తీసుకోవడం ఇవన్నీ చట్టప్రకారం నేరం అని అందరికీ తెలుసు. కానీ మాజీ మంత్రి బాలినేని బహిరంగంగా ఇలా మాట్లాడటంపై ఆ పార్టీ నేతలే తప్పుబడుతున్నారు

Visakha: విశాఖలో మరో ఐటీ దిగ్గజ సంస్థ ..ఐటీ మంత్రితో అమెరికా కంపెనీ ప్రతినిధుల మంతనాలు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju