AP Government: పేరెంట్స్ కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! అది ఏమిటంటే..?

Share

AP Government: ఏపిలో విద్యా వ్యాపారం అయిన సంగతి అందరికీ తెలిసిందే. పలు ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు చాలా సంవత్సరాల నుండి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. గత ఏడాది వరకూ ప్రవేటు విద్యాసంస్థళ ఫీజుల విషయంలో ప్రభుత్వం అంతగా పట్టించుకోకపోవడం వల్ల వారి ఇష్టానుసారం ట్యూషన్ ఫీజులను వసూలు చేసే వాళ్లు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థలను పునః ప్రారంభించారు.   ఈ తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కల్గించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యాసంస్థల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవేటు పాఠశాలలో నర్సరీ నుండి పదవ తరగతి వరకూ. కళాశాలలో ఇంటర్ వరకు ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రైవేటు కళాశాలలు ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తొలి సారిగా ఫీజులను ఖరారు చేసింది.

AP Government finalized private junior colleges, schools fees
AP Government finalized private junior colleges, schools fees

AP Government: ఫీజుల వివరాలు ఇలా..

గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.10వేలు, హైస్కూల్ విద్యకు రూ. 12 వేలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.11వేలు, హైస్కూల్ విద్యకు రూ.15వేలు, అదే కార్పోరేషన్ పరిధిలో ఉన్న పాఠశాలలకు ప్రైమరీ విద్యకు రూ.12వేల, హైస్కూల్ విద్యకు రూ.18వేలను ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక కళాశాలల విషయానికి వస్తే..గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కళాశాలలకు ఎంపీసీ, బైపీసీ విభాగాలకు రూ.15వేలు, ఇతర గ్రూపులకు రూ.12వేలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కళాశాలలకు ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500లు, ఇతర గ్రూపులకు రూ.15వేలు, కార్పోరేషన్ల్ పరిధిలో ఉన్న కళాశాలలకు ఎంపీసీ, బైపీసీలకు రూ.20వేలు, ఇతర గ్రూపులకు రూ.18వేలు నిర్ణయించారు.

 


Share

Related posts

చంద్రబాబు + పవన్ కల్యాణ్ + బీజేపీ కి మినిమమ్ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు జగన్ అసలు! 

sridhar

KGF 2 TEASER డేట్ వచ్చేసింది – ఫ్యాన్స్ రెడీ నా ??

Naina

విహంగాలతో ..! కొల్లేరు సరసు..! మరింత రమణీయం..!

bharani jella