ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

EX Minister Narayana: నారాయణ బెయిల్ రద్దుకై చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు

Share

EX Minister Narayana: పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేజ్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి నారాయణను పదవ తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ ఆరోపణలతో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లో అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నారాయణకు  11వ తేదీ తెల్లవారుజామున చిత్తూరు నాల్గవ అదనపు జడ్జి బెయిల్ మంజూరు చేశారు.

AP Government Petition Chittoor court cancel ex Minister Narayana bail
AP Government Petition Chittoor court cancel ex Minister Narayana bail

EX Minister Narayana: పిటిషన్ వేయకుండానే బెయిల్ మంజూరైంది

ఈ కేసులో నారాయణ కుట్ర ఉందనీ, ఆయనకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మధ్యాహ్నం న్యాయమూర్తి వాదనలు విననున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నారాయణ బెయిల్ మంజూరుపై జిల్లా కోర్టులో రివిజన్ ఫైల్ దాఖలు చేశామని చెప్పారు. బెయిల్ పిటిషన్ వేయకుండా బెయిల్ మంజూరు అయ్యిందన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారనీ, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు.


Share

Related posts

మొత్తం మీద బిగ్ బాస్ షో వల్ల అభి కి వచ్చిన లాభం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??

sekhar

Radhe shyam: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం భారీ ప్లాన్ వేశారు…

GRK

పవన్ కళ్యాణ్ తో ఈ ఒక్క సినిమా పడి ఉంటే ఆ యంగ్ డైరెక్టర్ కెరీర్ ఇంకోలా ఉండేది ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar