NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్

Share

AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుండి ఇవ్వాల్సిన డీఏను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.ఎంఎస్ నెం.66 ద్వరా ఉద్యోగులకు డీఏ, జీఓ ఎంఎస్ నెం.67 ద్వారా పెన్షనర్ లకు డీఆర్ 2.73 శాతం మంజూరు చేసింది. ఈ కొత్త జీవోను జూలై 1, 2023 వేతనంతో కలిపి ప్రభుత్వం అందజేయనున్నది.

CM YS Jagan

 

కాగా జనవరి 2022 నుండి జూన్ 2023 వరకూ ఇవ్వాల్సిన డీఏ బకాయిలను .. సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో మూడు సమాన వాయిదాలలో ఈ ఆర్దిక సంవత్సరంలో చెల్లించనున్నారు. ఈ కొత్త డీఏతో కలిసి ఉద్యోగులకు మొత్తం డీఏ 22.75 శాతం కానున్నది. డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఏపి ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఓ పక్క తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ పలు ఉద్యోగ సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేసింది.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలతో మరో చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ ..కవిత భర్త పేరూ చార్జిషీటులో


Share

Related posts

IND vs ENG: ఇంగ్లండ్ సిరీస్ ముందే చిక్కుల్లో భారత్..! హెల్ప్ చేస్తానన్న దినేశ్ కార్తీక్

arun kanna

మారనున్న ఏపీ రాజకీయాలు..! 25 జిల్లాల్లో మీ నియోజకవర్గం దేనిలో ఉందో చూసుకోండి

arun kanna

Corona Vaccine : కరోనా టీకా వల్ల రక్తం గడ్డ కడుతుందా? కేంద్రం క్లారిటీ

siddhu