AP Governor Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలి సారి శాసనసభకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తన ప్రసంగంలో వివరించారు గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తొందని అన్నారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందని చెప్పారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారులకే సొమ్ము అందిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. రాష్ట్ర అర్ధిక పరిస్థితి నాలుగేళ్లలో మెరుగుపడిందని అన్నారు. జీఎస్డీపీలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. ఏపిలో తలసరి ఆదాయం 2.19 లక్షలకు పెరిగిందన్నారు. విద్యా, వైద్య రంగంలో సమూలమైన సంస్కరణలు తెచ్చామన్నారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలను మెరుగుపర్చడమే కాకుండా సేవలలో మరింత నాణ్యత పెంచామని తెలిపారు. విద్యార్ధులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా మార్పులు తీసుకువచ్చామని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. పేద వారికి ఉచిత వేద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు కూడా పేదలకు ఉచితంగా చేయిస్తునన్నామన్నారు.
కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పాలన సాగుతుందని గవర్నర్ తెలిపారు. వైద్య రంగంలో మెరుగైన సేవలందించేందుకు పోస్టులను భర్తీ చేశామన్నారు. కొత్తగా 15 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైద్యుల నుండి నర్సుల వరకూ అన్ని పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నామన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యిందన్నారు. ఈ సదస్సు ద్వారా రూ.11.50 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎంవోయూలు కుదుర్చుకున్నామని దీని ద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని గవర్నర్ తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన అందిస్తున్నట్లు గవర్నర్ వివరించారు.
ఎంపీ అవినాష్ వినతిని తిరస్కరించిన సీబీఐ .. నాల్గవ సారి విచారణకు హజరైన అవినాష్ రెడ్డి