AP Governor: అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం పని చే్స్తుందని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసి బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నామని ఉగాది నుండి కొత్త జిల్లాలో పాలన ప్రారంభం కానుందని చెప్పారు. వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు.
2020-21 ఆర్ధిక సంవత్సరంలో 0.22 జీఎస్టీపీ వృద్€ధి జరిగిందన్నారు. ఉద్యోగులకు ఒకే సారి అయిదు డీఏలు విడుదల చేశామని గవర్నర్ తెలిపారు. 11వ పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచామన్నారు. తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి రూ.2,04,758కి చేరిందన్నారు. నవరత్న పథకాల ద్వారా మానవ, ఆర్ధిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నాడు – నేడు, ఆరోగ్యశ్రీ, బాలామృతం అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మూడు వాయిదాలో ఆర్ధిక సాయం అందించామన్నారు.
వైెఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి పదివేల వంతున ఇస్తున్నామన్నారు. రూ.770 కోట్లు సాయం చేశామన్నారు. స్యయం సహాయక సంఘాలకు రూ.12,758 కోట్లు కేటాయించినట్లు గవర్నర్ తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుతున్నాయన్నారు. పారదర్శక, అవినీతి రహిత పాలన అందిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం రేపటికి వాయిదా పడింది.
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…