32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రవిభన అంశంపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన కామెంట్స్

Share

రాష్ట్ర విభజన అంశంపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. రాష్ట్ర విభజన అంశంపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ఏపి ప్రభుత్వం తరపున హజరైన సీనియర్ న్యాయవాది రాష్ట్ర విభజన అంశాలను ఇక వదిలేయాలంటూ సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని రీసెంట్ గా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పు బట్టారు. ఇది సీఎం జగన్మోహనరెడ్డికి తెలిసి జరుగుతుందా లేదా అనేది తనకు తెలియదన్నారు. ఎవరి ప్రయోజనం కోసం ఈ అఫిడవిట్ వేశారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. నాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి పార్లమెంట్ నుండి బాయికాట్ కూడా చేసారనీ, ఇప్పుడు ఏపికి అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా జగన్ ఎందుకు మౌనం గా ఉంటున్నారని, గతంలో పోరాటం చేసిన ఆయ౉న ఇప్పుడెందుకు వెనుకంజ వేస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. ఇప్పుడు ఆ విషయాన్నే విస్మరిస్తూ విభజన గురించి వదిలివేయాలని అనడాన్ని ఆక్షేపించారు. ఉండవల్లి వ్యాఖ్యలపై ఇవేళ సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Sensational Comments On State Bifurcation

 

ఉండవల్లి వ్యాఖ్యలు అసంబద్దంగా అనిపిస్తున్నాయని, పని గట్టుకుని జగన్ వైపు వేలెత్తి చూపుతున్నట్లుగా అనిపించాయని సజ్జల అన్నారు. ఉండవల్లి అలా ఎందుకు అన్నారో తనకైతే అర్ధం కావడం లేదని అన్నారు. విభజన అసంబద్దమని ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తొందనీ, మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే తొలుత స్వాగతించేది వైఎస్ఆర్ సీపీయేనని సజ్జల స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుండి వైఎస్ఆర్ సీపీయే పోరాటం చేస్తున్నదని గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను వెనక్తి తిప్పాలి లేదంటే సరిదిద్దాలని గట్టిగా కొరతామన్నారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఉమ్మడి రాష్ట్రానికే తమ ఓటు అని, ఏ వేదికపై అయినా ఇదే మాట చెబుతామని అన్నారు. ప్రస్తుతం ఏపిలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం, పార్టీ వైఖరి ఇదేనంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజనకు వ్యతిరేకంగా తమ వాదనలు స్పష్టంగా వినిపిస్తామనీ, రాష్ట్ర విభజనను పునః సమీక్షించాలని లేదా సరిదిద్దాలని కోరతామని అన్నారు.

రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందని తెలిపారు. సజ్జల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇప్పటికే సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు. సజ్జల వ్యాఖ్యలు చూస్తే మళ్లీ తెలంగాణ మీద దాడి జరిగే కుట్రగా భావించాల్సి వస్తుందన్నారు. ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ, ఏపి విభజన జరిగి పదేళ్లు కావస్తుంది, రెండు ప్రభుత్వాలు ఏర్పాడ్డాయన్నారు. ఇవేళ ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలి అని కోరుకోవాలే తప్ప మళ్లీ కలిపే ప్రయత్నం వైసీపీ చేస్తే మళ్లీ కూడా తెలంగాణపై రాజ్యాధికారం కోనసాగించాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తొందన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి పరిపాలన సాగుతున్న క్రమంలో మళ్లీ కలిసే అవకాశాలు ఉండవనీ, విభజన అనేది ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. సజ్జల వ్యాఖ్యలు రాజకీయ ఎత్తుగడలో భాగమని ఆయన విమర్శించారు.

Suicide: ఏపిలో తహశీల్దార్ ఆత్మహత్య .. కారణం అందేనా..?


Share

Related posts

Aranya : అరణ్య షూటింగ్ లో రెండుసార్లు చావు నుండి తప్పించుకున్న రానా

siddhu

‘మోదీకి షూటింగ్ ముఖ్యమా’?

sarath

పెళ్ళి అయిన పక్కరోజే షాకిచ్చిన కాజల్..! ఇక నా వల్ల కాదంటూ ‘బై’ చెప్పేసింది

siddhu