AP Govt: ఏపి ప్రభుత్వ మరో కీలక నిర్ణయం..! బ్రాహ్మాణ కార్పోరేషన్ శాఖ మార్పు..!!

Share

AP Govt: ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బ్రాహ్మణ కార్పోరేషన్ ను దేవాదాయ శాఖ పరిధి నుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెరుగైన సమన్వయం కోసం ఏ పి బ్రాహ్మణ కార్పోరేషన్ ను బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి మార్పు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

AP Govt: brahmin corporation under bc welfare department
AP Govt: brahmin corporation under bc welfare department

బ్రాహ్మణ కార్పోరేషన్ ను ఆర్థికంగా వెనుకబడిన కార్పోరేషన్ల పరిధిలోకి తీసుకురావడం వల్ల సంస్థల మద్య మరింత మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. దీనికి సంబంధించి ఏపి ప్రభుత్వ బిజినెస్ రూల్స్ లో మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని కోసం తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖను, బీసీ సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్రాహ్మణ కార్పోరేషన్ కు ఎంత మేలు జరుగుతుందో తెలియదు కానీ ఆ కార్పోరేషన్ చైర్మన్ కు భవిష్యత్తులో ఓ గౌరవ పదవి కోల్పోయే అవకాశం ఉందనే మాట వినబడుతోంది. బ్రాహ్మణ కార్పోరేషన్ ఇప్పటి వరకూ దేవాదాయ శాఖ పరిధిలో ఉండటం వల్ల టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కు అవకాశం ఇస్తున్నారు. ఇకపై బీసీ సంక్షేమ శాఖ కింద బ్రాహ్మణ కార్పోరేషన్ ఉండటం వల్ల తరువాతి టీటీడీ పాలకమండలిలో దీని చైర్మన్ ఆ పదవి కోల్పోయే అవకాశం ఉంటుందనే మాట వినబడుతోంది. చూడాలి ఏమి జరుగుతుందో.

Read more: Pawan Kalyan: జగన్ పాలనపై సీరియస్ కామెంట్స్ చేసిన పవన్ కల్యాణ్..!!


Share

Related posts

బిగ్ బాస్ 4: అవినాష్ విషయంలో మొత్తానికే మోసం వచ్చి పడేటట్టు ఉంది..??

sekhar

భూమా అఖిలప్రియ కు కోర్టులో చుక్కెదురు..! బెయిల్ తిరస్కరణ…!

somaraju sharma

రెండు తెలుగు రాష్ర్టాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్! ప్రజల్లో ఉత్సుకత… సంబరం!!

Yandamuri