33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలో కొత్తగా ఆరు మండలాల ఏర్పాటునకు నోటిఫికేషన్

Share

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో ఆరు మండలాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదిస్తూ ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలును అర్బన్, రూరల్ మండలాలుగా, మచిలీపట్నం జిల్లా కేంద్రాన్ని మచిలీపట్నం సౌత్, నార్త్ మండలాలుగా విభజించనున్నట్లు పేర్కొంది. మచిలీపట్నంలోని 1- 19, 40 వార్డు, 18 గ్రామాలను మచిలీపట్నం నార్త్ గా, మచిలీపట్నం పరిధిలోని 20 – 39 వార్డులు, మచిలీపట్నం రూరల్ సహా 12 గ్రామాలను మచిలీపట్నం సౌత్ మండలంగా విభజించింది.

AP Govt

 

ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన రెవెన్యూ శాఖ.. మండలాల విభజనకు సంబంధించిన ప్రాధమిక నోటిఫికేషన్ లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పేర్కొంది. నోటిఫికేషన్ లోని అభ్యంతరాలు, సలహాలు, సూచనలను 30 రోజుల్లోగా స్థానిక జిల్లా కలెక్టర్ కు తెలియచేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇంతకు ముందు 13 జిల్లాల నుండి 26 జిల్లాలుగా మార్పు చేయడంతో పాటు రెవెన్యూ డివిజన్ లను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయా జిల్లా కేంద్రాల్లో జనాభా, గ్రామాలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు గా తెలుస్తొంది.

శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు .. తమ పీఠంపై రాజకీయ ముద్ర వేయాలని చూశారంటూ..


Share

Related posts

Ys Jagan : గర్భిణీలకు వైద్య పరీక్షల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..!!

sekhar

Today Horoscope డిసెంబర్ 27th ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు.

Sree matha

కేసీఆర్ ధైర్యానికి… తాజా ఉదాహ‌ర‌ణ ఏంటంటే….

sridhar