ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ అందించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ కు రెండేళ్ల వయసు సడలిస్తూ ఏపి సర్కార్ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి సడలింపునకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధుల వినతి మేరకు సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో ఆరు వేలకుపైగా కానిస్టేబుళ్లు, 400లకుపైగా ఎస్ఐ పోస్టుల నియామకానికి ఏపి సర్కార్ గత నెలలోనే నోటిపికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఐ పోస్టులకు 2023 జనవరి 18వ తేదీ వరకూ, కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 28వ తేదీ వరకూ ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తుల స్వీకరించనున్నారు. ప్రభుత్వం ఈ నియామకాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచడంతో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు ప్రెపేర్ అవుతున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ లకు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక కామెంట్స్
