NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉగాది పండుగ వేళ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

ఉగాది పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులు ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ పని చేస్తున్న వారు అయినా వారు కోరుకున్న చోట ప్లాట్ తీసుకోవచ్చు. గతంలో ఉద్యోగులు పని చేస్తున్న ప్రాంతంలో ఉన్న జగనన్న టౌన్ షిప్ లలో మాత్రమే కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉండేది. అయితే ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిబంధనలను సడలిస్తూ జీవో 38ని విడుదల చేసింది. రాష్ట్రంలో 22 నగరాలు, పట్టణాల్లో అన్ని అనుమతులు, ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లను అభివృద్ధి చేసింది. వీటిని మార్కెట్ ధర కంటే తక్కువకే అందుబాటులో ఉంచింది. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

AP Govt Good News to Employees

 

అన్ని లేఆవుట్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు పది ప్లాట్లు రిజర్వ్ చేయడంతో పాటు ధరలో 20 శాతం రిబేట్ సౌకర్యం కూడా కల్పించింది. తాజా నిబంధనలతో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు వీలు కలుగుతోంది. మొత్తం 22 జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కల్గడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్ వివరాలను https://migapdtcp.ap.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు.

Read More: Delhi Liquor Scam: ముగిసిన ఈడీ విచారణ .. మరో సారీ తప్పదా..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju