CM YS Jagan: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపి సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామ సచివాలయం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్ కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి తెలిపారు. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించారని చెప్పారు.

రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులన్నారు. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించారని తెలిపారు. జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించారని చెప్పారు.అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు మూడున్నర లక్షల మందికిపైగా ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. వీరు విధుల్లోకి చేరి మూడున్నర సంవత్సరాలకుపైగా అవుతోంది. వారు విధుల్లో చేరినప్పటి నుండి ఒకే ప్రాంతంలో పని చేస్తున్నారు. విధుల్లోకి చేరిన తర్వాత తొలి సారిగా బదిలీలకు అవకాశం లభించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
AP Govt: గ్రూప్ – 1, 2 ఉద్యోగార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్