నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే తరుణంలో ధాన్యం రైతులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యంకు రూ.1,096.52 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు 3.29 లక్షల మంది రైతుల నుండి రూ.3,781 కోట్ల విలువైన 18.52 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. తాజా జరిగిన చెల్లింపులతో ఇప్పటి వరకు మొత్తం 2.84 లక్షల మంది రైతులకు రూ.2,924.53 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు అయ్యింది.

రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులను వేగంగా చేస్తొంది. 21 రోజులలోపు చెల్లించాలని నిర్ణయించుకున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేసిన వారం పది రోజుల్లోనే రైతుల ఖాతాలకు నగదును జమ చేస్తొంది. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల వల్ల ఒకటి రెండు రోజులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా గోనె సంచులు, రవాణా చార్జీలు, హమాలీ ఖర్చులను కూడా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. వీటి కింద ఇప్పటి వరకూ రూ.45.91 కోట్లు విడుదల చేసింది. గతంలో చెల్లింపులు సకాలంలో జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం నుండి నగదు చెల్లింపులు ఆలస్యం అవుతుండటంతో గతంలో ఎక్కువ మంది రైతులు దళారులకు తమ ధాన్యాన్ని విక్రయించుకునే వారు. ప్రస్తుతం ఆర్ బీ కే ల ద్వాారా కొనుగోలు చేస్తున్న ధాన్యానికి పది రోజులు లోపుగా వారి ఖాతాల్లోకి నగదు జమ అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..?
Prabhas: ప్రభాస్ కి అడుగడుగునా కష్టాలు అప్పటి నుంచి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..!