NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Flash..Flash: ఏపిలో రేషన్ కార్డులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. జనవరి నుండి ఇళ్ల ముందే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ..?

Flash..Flash: దేశంలో రేషన్ కార్డుదారులకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఎవై) ఉచిత రేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2023 వరకూ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తూ ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఏపిలో ఇప్పటి వరకూ రెగ్యులర్ పీడీఎస్ బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీలను ఎండియూ ఆపరేటర్ ( డోర్ డెలివరీ వ్యాన్) ల ద్వారా పంపిణీ జరుగుతుండగా, ప్రధాన మంత్రి ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఉచిత బియ్యాన్ని గతంలో మొత్తం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయగా, గత నాలుగైదు నెలల నుండి కేవలం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు.

Free Ration Distribution

కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం సరఫరా చేస్తుండగా, మిగిలిన స్టేట్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని భరాయించి గతంలో పంపిణీ చేసింది. అయితే ఇది రాష్ట్రానికి మరింత ఆర్ధిక భారం కావడంతో కేంద్ర ప్రభుత్వ అనుమతితో కేవలం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వచ్చారు. కొంత మందికి మాత్రమే ఉచిత బియ్యం ఇస్తూ మరి కొందరికి ఇవ్వకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో వచ్చే నెల జనవరి నుండి డిసెంబర్ వరకూ మొత్తం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నదని సమచాారం.

AP CM YS jagan

 

రెగ్యులర్ పీడీఎస్ బియ్యం పంపిణీ నిలుపుదల చేసి పీఎంజీకేఏవై ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార (డబ్బులకు) ను రేషన్ కార్డుదారులకు ఎండియు (డోర్ డెలివరీ వ్యాన్) ఆపరేటర్ ల ద్వారా పంపిణీ చేయన్నారని తెలుస్తొంది. రాష్ట్రంలో మొత్తం 1,45,43,997 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో 90,27,636 ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉన్నాయి. గత నాలుగైదు నెలల నుండి ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం విడుదల చేస్తూ వస్తున్నారు. పీఎంజీకేఏవై స్కీమ్, రెగ్యులర్ పీడీఎస్ కోటా లను కలిపి ఒకే పథకం గా మార్పు చేసి 2023 జనవరి నెల నుండి మొత్తం రాష్ట్రంలోని కార్డుదారులకు ఎండీయు ఆపరేటర్ ల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నదని  సమాచారం. ఢిల్లీ టూర్ లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం ఈ ప్రతిపాదనపై ఆమోదం తీసుకుని జనవరి నుండి అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల రావాల్సి ఉంది.

Gram Panchayat sarpanches: ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యింది .. రేపు ఏపికీ పాకుతుందా..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju