AP Govt: ఆన్ లైన్ సినిమా టికెట్ల కై జీవో 142 జారీ చేసిన ఏపి సర్కార్..!!

Share

AP Govt: ఏపిలో సినిమా టికెట్ల ధరలపై వివాదం కొనసాగుతుండగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ ద్వారా టికెట్ల విక్రయానికి సంబంధించి ప్రభుత్వం జీవో 142 విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం సినిమా టికెట్ల విక్రయాలు మొత్తం ప్రభుత్వం కంట్రోల్ లోకి వెళ్లిపోతాయి. ఏ సినిమా టికెట్స్ అయినా ప్రభుత్వం ద్వారానే అమ్మకాలు జరుగుతాయి. సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ బాధ్యతలను ప్రభుత్వం ఏపి ఫిలిమ్ డవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీఎఫ్సీ) కు అప్పగించింది. త్వరలోనే ఈ ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. మువీ టికెట్స్ అమ్మకాల కోసం ఐఆర్సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటునకు ప్రభుత్వం ఇటీవలే సినిమాటోగ్రఫీ చట్టసవరణ చేసిన సంగతి తెలిసిందే.

AP Govt issued online cinema tickets go
AP Govt issued online cinema tickets go

AP Govt: హైకోర్టులో టికెట్ ధరల వ్యవహారం

ఇదిలా ఉండగా మువీ టికెట్ల ధరలను నియంత్రిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35పై మరో పక్క వివాదం నడుస్తోంది. ప్రాంతాల వారీగా టికెట్ రేట్లు ఎంత ఉండాలో ప్రభుత్వం జివోలో పేర్కొంది. అయితే పలువురు థియేటర్ యజమాన్యాలు ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జివో 35కి జారీ చేయకముందు ఉన్నవిధానంలోనే టికెట్లు విక్రయించుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన అదేశాలను ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ధియేటర్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా టికెట్ ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులపై భారం పడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

సినిమా హాళ్ల టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం సరికాదనీ, భారీ బడ్జెట్ సినిమాలకు, లోబడ్జెట్ సినిమాలకు ఒకే ధరలు నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు నష్టాలు వాటిల్లుతాయని థియేటర్ల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మువీ టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్లు నిర్ణయాలు తీసుకుంటారనీ, థియేటర్ల యాజమాన్యాలు తమ ప్రతిపాదనలు జాయింట్ కలెక్టర్ వద్ద ఉంచాలనీ, ప్రభుత్వం ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ అమలునకు సంబంధించి తాజాగా జీవో జారీ చేయడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.


Share

Related posts

Akkineni akhil: అక్కినేని అఖిల్ సినిమాలో కీలకపాత్ర చేయబోతున్న రష్మిక మందన..??

sekhar

KCR: ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…

sridhar

ప్రైవేటు తుపాకీ కేంద్రం ప్రారంభం

Siva Prasad