NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt Jobs: ఏపిలో ఉద్యోగ ఖాళీలు ఇవి..! గుడ్ న్యూస్ ఎప్పుడంటే..?

AP Govt Jobs: అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగక చాలా కాలంగా నిరుద్యోగ యువతీ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సర్కార్ లక్షకు పైగా ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ప్రకటించింది. సీఎం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల నియామానికి సంబంధించి ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపిలోని ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎప్పుడు నియామకం చేస్తారు అనేది మాత్రం స్పష్టంగా ప్రభుత్వం వెల్లడించలేదు కానీ త్వరలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామని ప్రకటించింది.

AP Govt Jobs vacancies
AP Govt Jobs vacancies

 

ఏపి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు అశోక్ బెందాళం, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజులు రాష్ట్రంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య, భర్తీ చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీల వివరాలను వెల్లడించింది.

 

AP Govt Jobs: ఏపిలో 66, 409 ఉద్యోగాలు ఖాళీ

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 66, 409 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 7,71,177 ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా, వీరిలో శాశ్వత ఉద్యోగులు 5,29, 868 మంది, కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 1,75,000 మంది వరకూ ఉన్నట్లు చెప్పింది. మొత్తం శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు 7,04,868 మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా1,27,000 ఉద్యోగాలు భర్తీ చేయగా, వైద్యారోగ్య శాఖలో 22,306 ఉద్యోగాలు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా నియామకాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.   రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని తెలియజేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N