AP Govt: ఎయిడెడ్ విద్యాసంస్థలపై జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..!

Share

AP Govt: ఏపిలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై విద్యార్ధుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. విద్యార్ధులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తరువాత 60 శాతంకు పైగా పాఠశాలల యాజమాన్యాలు అంగీకారం తెలియజేస్తూ ప్రభుత్వానికి లేఖలు ఇచ్చాయి. ప్రభుత్వ ఉత్తర్వులపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో బలవంతంగా ఎయిడెడ్ పాఠశాలలను విలీనం చేయవద్దని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విలీనానికి సంబంధించి బలవంతం ఏమీలేదనీ, వారికి ఇష్టమైతే యాజమాన్యాలు నడుపుకోవచ్చని తెలిపింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం విద్యాశాఖ సమీక్షలో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలకు తెలియజేయాలని ఆదేశించారు. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా పలు ఎయిడెడ్ విద్యాసంస్థల వద్ద విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt ket orders on aided educational institutions
AP Govt ket orders on aided educational institutions

AP Govt: ఎయిడెడ్ విద్యాసంస్థలకు నాలుగు ఆప్షన్లు

ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలపిిన ఎయిడెడ్ విద్యాసంస్థలు పునరాలోచనకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు ఇచ్చారు. అందులో మొదటి ఆప్షన్ గా ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులతో సహా ఎయిడెడ్ విద్యాసంస్థలో పని చేస్తున్న ఉపాధ్యాయులను, సిబ్బందిని పూర్తి గా ప్రభుత్వానికి అప్పగించడం. రెండవ ఆప్షన్ గా విద్యాసంస్థల ఆస్తులు కాకుండా కేవలం మంజూరు అయిన ఉపాధ్యాయ పోస్టులను, సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థగా కొనసాగించడం, మూడవ ఆప్షన్ గా మొదటి రెండు ఆప్షన్ లకు వ్యతిరేకంగా పూర్తిగా ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలుగా కొనసాగించడం, నాల్గవ ఆప్షన్ గా మొదటి, రెండు ఆప్షన్ లలో ఇప్పటికే ఎంచుకుని విలీనం చేయడానికి అంగీకరించిన విద్యాసంస్థలకు పునరాలోచన కల్పిస్తూ విలీనంపై అంగీకారానికి వెనక్కి తీసుకుని పూర్తిగా ఎయిడెడ్ విద్యాసంస్థగా నడుపుకోవడానికి అవకాశం ఇచ్చింది.

file photo
file photo

రాష్ట్ర వ్యాప్తంగా 2249 ఎయిడెడ్ విద్యా సంస్థలు

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2249 ఎయిడెడ్ విద్యాసంస్థలలో 68.78 శాతం మొదటి రెండు ఆప్షన్లకు స్వచ్చందంగా అంగీకరించాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపినట్లు తెలిపింది. తాజాగా మరో సారి విలీనానికి అంగీకరించిన ఎయిడెడ్ విద్యాసంస్థలు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యయి. వీలైనంత త్వరగా ఎయిడెడ్ విలీన ప్రక్రియ ముగించడానికి పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక శాఖ, ఇంటర్ బోర్డు లు చర్యలు తీసుకోవాలని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.


Share

Related posts

Vijaya Sai Reddy: అశోక్ గజపతిరాజుపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపి విజయసాయిరెడ్డి

somaraju sharma

Sai Pallavi: సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆఫర్ అందుకున్న హీరోయిన్ సాయి పల్లవి..!!

sekhar

TTD: శ్రీవారి స్థానిక భక్తులకు గుడ్ న్యూస్..నేటి నుండి సర్వదర్శనం టోకెన్లు జారీ..

somaraju sharma