AP Govt: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..! ప్రైవేటు లే అవుట్ వ్యాపారులకు బిగ్ షాక్..!!

YSRCP: Some Leaders Trouble to Face Jagan
Share

AP Govt: ఏపి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు లే అవుట్లు విక్రయదారులకు భారీ షాక్ ఇచ్చేలా జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రైవేటు లే అవుట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలని నిబంధన పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. లేవుట్ దారులు ప్రభుత్వానికి కేటాయించిన 5 శాతం భూమిని పేదల కోసం నిర్మించే జగనన్న కాలనీలకు వినియోగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

AP Govt key orders on private layouts
AP Govt key orders on private layouts

AP Govt: ప్రైవేటు లేఅవుట్ ల్లో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలి

ఇకపై రాష్ట్రంలో ప్రైవేటు లేఅవుట్ లు వేసి ప్లాట్లు విక్రయించే వాళ్లు ఆ భూమిలో 5 శాతం జిల్లా కలెక్టర్ కు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొత్తగా నిర్మించే లే అవుట్ లలో భూమి ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరో రెండు ఆప్షన్లు ఇచ్చింది. వాళ్ల లే అవుట్ భూమికి మూడు కిలో మీటర్ల పరిధిలో 5 శాతం భూమి విలువకు సరిపడా భూమిని కొనుగోలు చేసి అప్పగించాల్సి ఉంటుంది. లేకుంటే భూమి విలువ మేర డబ్బులు కూడా ప్రభుత్వానికి చెల్లించవచ్చు. లే అవుట్ ల డెవలప్ మెంట్ ద్వారా వచ్చే భూమి లేదా నగదును పేదల కోసం నిర్మించే జగనన్న కాలనీలకు వినియోగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మధ్యతరగతి వర్గాలకు పెరగనున్న భారం

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద వర్గాలకు మేలన్న మాట వినబడుతున్నా, ప్లాట్లు కొనుగోలు చేసే మధ్యతరగతి వర్గాలపై ఆ భారం పడుతుందన్న విమర్శ వస్తుంది. ప్రైవేటు లే అవుట్ లలో ఇంతకు ముందే కొంత మేర కమ్యూనిటీ సైట్ కింద కేటాయించాలన్న నిబంధన ఉంది. దానికి తోడు మరో 5 శాతం భూమిని జగనన్న కాలనీకి కేటాయించడం సంబంధిత లేఅవుట్ విక్రయదారులకు పెట్టుబడి భారం పెరుగుతోంది. దీనిపై రియల్టర్ల ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.


Share

Related posts

ఏపీ జ‌నాలు ఎర్రి ఎంగ‌ల‌ప్ప‌లు… వైసీపీ , టీడీపీ నేత‌లు ఇదే చెప్తున్నారు

sridhar

ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీకి రాంగోపాల్ వర్మే న్యాయం చేయగలడు !

Yandamuri

అనసూయతో డ్యాన్స్ చేయకపోతే మా అమ్మ అన్నం కూడా పెట్టదు.. కార్తికేయ షాకింగ్ కామెంట్స్?

Varun G