NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt : పురుషోత్తంపట్నంపై తాజా తీర్పు..హైకోర్టే కాదు సుప్రీంతోనూ తలనొప్పులు ప్రారంభం అయ్యాయా..?

AP Govt : ఏపి ప్రభుత్వానికి కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు రావడం సర్వసాధారం అయిపోయింది. ఇటీవల కాలం వరకూ ఏపి హైకోర్టు నుండే అనుకుంటే సుప్రీం కోర్టులోనూ వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కోర్టుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించలేకపోవడా ? నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికారులు నిబంధనలు పాటించకపోవడమా? అనే విషయాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

AP Gov t: Latest verdict on Purushottampatnam
AP Gov t Latest verdict on Purushottampatnam

గత నెలలోనే స్థానిక ఎన్నికలకు సంబంధించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీం కోర్టు కొట్టివేయగా ఇప్పుడు తాజాగా పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం అన్న ఎన్  జీ టీ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఎన్ జీ టీ తీర్పులో జోక్యం చేసుకోవానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం పై ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై సోమవారం జస్టిస్ రోయింగ్ టన్ నారిమన్, జస్టిస్ అనిరుధ్ బోస్ ల కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంలో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదనీ ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వెంకట రమణి వాదనలు విపించారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇస్తామని వివరించారు. విశాఖ పట్నం నగరానికి తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుందని అన్నారు. కొత్త ఆయకట్టు లేని ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని న్యాయవాది వాదనలు వినిపించారు. బాధిత రైతుల తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వివరించారు.

పోలవరం ప్రాజెక్టుకు 2006లో పర్యావరణ అనుమతులు రాగా పురుషోత్తమపట్నం ప్రాజెక్టు పనులు 2016- 17లో చేపట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, సామాజిక ప్రభావాలను అధ్యయనం చేయలేదని అన్నారు. రైతుల నుండి తీసుకున్న భూములకు ఇంకా పరిహారం ఇవ్వలేదని కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్ జీటీ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. మెరిట్స్, డీ మెరిట్స్ చూసుకుని ముందడుగులు వేస్తే ఇటువంటి పరిస్థితులు రావని అంటున్నారు పరిశీలకులు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!