AP Govt: సుప్రీం కోర్టు తీర్పును గౌరవించిన ఏపి సర్కార్

Share

AP Govt: ఏపి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ఏపి ప్రభుత్వం గౌరవించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఏపి ప్రభుత్వం. ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ జీవో జారీ చేశారు. ఫిబ్రవరి 8 నుండి సర్వీస్ లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

AP Govt lifts IPS ABV suspension on Supreme Court orders

AP Govt: టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసి..

ఏపి వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు అభియోగాలపై ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ పై ఆయన క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ తదుపరి ఏబీ వెంకటేశ్వరరావు ఏపి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేయాలని, విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ ఎత్తివేత

అయితే ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టులో ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును సమర్ధించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తనను విధుల్లోకి తీసుకోవాలంటూ ఇటీవల ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. రెండు పర్యాయాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మను కలిసేందుకు ఏబీ వెంకటేశ్వరరావు ప్రయత్నం చేసినా సీఎస్ అపాయింట్మెంట్ లభించలేదని వార్తలు వచ్చాయి. తాజాగా ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ జీవో విడుదల చేసింది. జీఏడికి రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావుకు ఉత్తర్వులను ప్రభుత్వం పంపింది.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

4 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago