NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబు బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్

Share

Chandrababu: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 28వ తేదీ వరకూ చంద్రబాబు కు గతంలో ఏపీ హైకోర్టు ఆరోగ్య కారణాల రీత్యా మద్యంతర బెయిల్ మంజూరు చేయగా, తాజాగా నిన్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు, టీడీపీ ఖాతాలకు నిధులను మళ్లించారు అనేందుకు సీఐడీ ప్రాధమిక ఆధారాలను సమర్పించలేకపోయిందని తేల్చి చెప్పిన హైకోర్టు..ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబు రిమాండ్ విధించాలని అభ్యర్దించకముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది.

Chandrababu

స్కిల్ కేసులో నిధులు టీడీపీ ఖాతాలోకి చేరాయనేందుకు దర్యాప్తు సంస్థ సీఐడీ వద్ద అధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలకు ఏకీభవించిన హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు దశలోనే కేసులో సాక్ష్యాలు లేవని చెప్పడం హైకోర్టు తన పరిధిని అతిక్రమించడమేనని పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

కాగా, చంద్రబాబు కేసులో ఏపీ హైకోర్టు తీర్పు న్యాయసమ్మతంగా లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, బెయిల్ స్టేజీలోనే సాక్ష్యాలు లేవని ఏపీ హైకోర్టు అనడం సరైంది కాదని అన్నారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందన్నారు. ఇది అసాధారణమైన విషయమన్నారు. చార్జిషీటు వేయనంత వరకూ దర్యాప్తు కొనసాగుతున్నట్లేనని అన్నారు. టీడీపీ అకౌంట్ లో ఊరు పేరు లేని నగదు జమ అయ్యిందని చెప్పారు.

దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈడీ కూడా ఈ కేసు దర్యాపతు చేస్తొందని పేర్కొన్నారు. సిమెన్స్ అంతర్గత నివేదికలు, ఫొరెన్సిక్ ఆడిట్ లో అక్రమాలు బయటపడ్డాయన్నారు. ఏపీ హైకోర్టు ఈ కేసులో మినీ ట్రయల్ జరిపిందని, మినీ ట్రయల్ నిర్వహించడం చట్ట విరుద్దమని పేర్కొన్నారు. ఇది సామాజిక ఆర్ధిక కుంభకోణమని, రూ.371 కోట్లు ప్రజల సొమ్ము దోచేశారన్నారు.

Video Viral: ఐక్యతలో అనైక్యత .. కురుబ సంఘం గుడికట్ల సంబరాల్లో నేతల మధ్య వాగ్వివాదం.. వీడియో వైరల్


Share

Related posts

YS Sharmila: వైఎస్ షర్మిల హౌస్ అరెస్టు .. ఇంటి వద్దే షర్మిల నిరాహార దీక్ష

somaraju sharma

Epiphora: కంటి నుంచి నీరు కారకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి..!!

bharani jella

Radheshyam: రన్‌టైమ్ మరీ అంత తక్కువా..ఫ్యాన్స్‌కు మళ్ళీ డిసప్పాయింట్..?

GRK