NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt Schools: కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా జగనన్న సర్కార్ బడిలో ఫలితాలు..సాక్షం ఇదే

AP Govt Schools: చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు ఇంతకు ముందు ప్రభుత్వ బడుల్లోకి పిల్లలను పంపడం అంటే నామోషీగా ఫీల్ అయ్యే వారు. అప్పోసప్పో చేసి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపేవాళ్లు. కానీ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ విద్యావ్యవస్థలో మార్పునకు చర్యలు చేపట్టారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి పరిచారు. మౌలిక వసతులను కల్పించారు. ప్రైవేటు, కార్పోరేట్ స్కూళ్లకు మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయ స్థాయిలో అడ్మిషన్లు పెరిగాయి. ఇటీవల పదవ తరగతి ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఇంతకు ముందు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రమే తమ విద్యాసంస్థ విద్యార్ధులు విజయదుంధుభి మోగించారంటూ పెద్ద ఎత్తున కరపత్రాలు, పోస్టర్లు వేసుకునేవారు, ప్రచారం చేసుకునే వారు.

AP Govt School performance
AP Govt School performance

 

AP Govt Schools: ఈవూరుపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రతిభ

కానీ ఇప్పుడు జగనన్న సర్కార్ బడుల్లోనూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు రాబడుతున్నారు. పదవ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్ధులు సాధించిన ఘనతను తెలియజేస్తూ బ్రోచర్లు, కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఫణితపు జయశ్రీ అనే విద్యార్ధిని 600 మార్కులకు 590 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. మరో 18 మంది విద్యార్ధినులు 500లకు పైగా మార్కులు సాధించారు. ఈ గ్రామంలో ఎక్కువ శాతం మంది చేనేత కార్మికులే. వారి పిల్లలే పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ బడిలో చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులైయ్యారు. దీంతో నేతన్నల ఊరిలో విద్యా కిరణాలు అంటూ ప్రత్యేకంగా బ్రోచర్ వేసి తాజా అడ్మిషన్ల కోసం స్కూల్ యాజమాన్యం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రోచర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా

ఈ ప్రకటన చూసి ఇదేదో లక్షలకు లక్షలు ఫీజులు కట్టుంచుకునే నారాయణో, శ్రీ చైతన్య స్కూల్ దో కాదు. ఇది మామూలు పేద వాళ్ల పిల్లలు చదివే గవర్నమెంట్ జిల్లా పరిషత్ హైస్కూల్ కరపత్రమని పేర్కొంటున్నారు. ఇలాంటి దృశ్యాలు గతంలో ఎప్పుడూ చూడలేదు కూడా. ఉచిత ఫీజు, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, ఉచిత యూనిఫాం, ఐడి కార్డు, ఉచిత మధ్యాహ్న భోజన పథకం, ఉచిత నోట్ పుస్తకాలు, అక్స్‌ఫర్డ్ డిక్షనరీ, ఉచిత శానిటరీ కిట్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించడంతో పాటు అమ్మఒడి పథకం కింద ఏడాదికి ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తొంది. చిరుద్యోగులు, నేతన్నలు, ఇతర కార్మికులు వారి పిల్లల కోసం ఇంతకు ముందులా రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రైవేటు పాఠశాలలకు ధారపోయాల్సిన పని లేకుండా ఇన్ని ఉచిత వసతులతో మంచి విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే రోజులు వచ్చేశాయి. ఇదిగో ఈ బ్రోచర్ చూస్తున్నారుగా, వాళ్లు పిలుస్తున్నారు. వాళ్లు పిలుస్తున్నారు. మీ బాలికలను నిశ్చితంగా వాళ్ల దగ్గరకు పంపించండి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?