NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలో రేషన్ కార్డుదారులకు మరో గుడ్ న్యూస్ .. ప్రజల ఆరోగ్యం కోసం మరో రెండు వస్తువుల పంపిణీకి చర్యలు

ఏపిలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందిస్తొంది. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తొంది. బియ్యం ఉచితంగా ఇస్తుండగా, కందిపప్పు, పంచదార నగదుపై పంపిణీ చేస్తున్నది. అయితే వచ్చే నెల నుండి ప్రజలకు బలవర్దకమైన చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు రాగులు, జొన్నల పంపిణీకి గానూ కార్డుదారుల నుండి అభిప్రాయాలు సేకరిస్తొంది. రేషన్ డీలర్లు, ఎండీయు ఆపరేటర్ ద్వారా బియ్యం బదులుగా రాగులు, జొన్నలు తీసుకునేందుకు ఇష్టపడుతున్నారా లేదా అనే విషయంపై కార్డుదారుల నుండి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

ap govt taking steps to give millets to Ration card holders
ap govt taking steps to give millets to Ration card holders

 

ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది (2023) ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా తగిన సూచనలు చేసింది. ప్రజలకు రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలు వంటివి సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలను వివరిస్తూ పౌరసరఫరాల శాఖ కరపత్రాలను పంపిణీ చేస్తొంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఎంత మేర చిరు ధాన్యాలను పండిస్తున్నారు అనే వివరాలను సేకరిస్తున్నది. అదే విధంగా కార్డుదారుల అభిప్రాయాల ద్వారా వచ్చిన సమాాచారంతో డిమాండ్ ను బట్టి రాగులు, జొన్నల పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నది పౌర సరఫరాల శాఖ. కార్డుదారులు రెండు కేజీల బియ్యం తగ్గించుకుని దాని స్థానంలో రాగులు లేదా జొన్నలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ఫిబ్రవరి నెల కోటా నుండి ఈ చిరుధాన్యాల పంపిణీకి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.

చంద్రబాబు సహా విపక్షాలకు షాక్ .. జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్ధించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju