NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఏపీ..పెట్టుబడుల్లో టాప్

AP Govt: ఒ పక్క జగన్ సర్కార్ (YS Jagan Govt) పై ప్రతిపక్షాలు ఏదో ఒక అంశంపై విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో ఏపి (AP)కి జాతీయ స్థాయి అవార్డులు (National Awards) వస్తున్నాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపి సర్కార్ మరో సారి సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of doing Business) లో మళ్లీ ఏపి మొదటి స్థానం కైవశం చేసుకుంది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020 లో ఏపి నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం టాప్ ఎబీవర్స్ పేరుతో ఏడు రాష్ట్రాలను ప్రకటించింది. ఇందులో ఏపి 97.89 శాతం స్కోర్ సాధించి ప్రధమ స్థానంలో నిలవగా, 97.77 శాతం స్కోర్ తో గుజరాత్ రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాత తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ 94.86 శాతం స్కోర్ సాధించి మూడు, నాల్గవ స్థానాల్లో నిలిచాయి. టాప్ అచివర్స్ లో ఏపితో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు చోటు సంపాదించాయి.

AP Govt top place business reform action plan 2020
AP Govt top place business reform action plan 2020

రాష్ట్రాలకు నాలుగు కేటగిరిలుగా కేంద్రం విభజించి ర్యాంకులు కేటాయించింది. ఈ సారి గతంలో మాదిరిగా కాకుండా కొత్త విధానాలతో కేంద్రం ర్యాంకింగ్ ప్రక్రియ చేపట్టింది. ర్యాంకుల కేటాయింపునకు కేంద్రం మొత్తం 10,200 మంది పెట్టుబడిదారులు, స్టేక్ హోల్డర్స్ నుండి అభిప్రాయాలను సేకరించింది. అని రంగాల్లోనూ ఏపి ప్రభుత్వంపై పెట్టుబడిదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. కేంద్రం ఇచ్చిన ర్యాంకులపై ఏపి సర్కార్ హర్షం వ్యక్తం చేసింది. అచివర్స్ లిస్ట్ లో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అస్పిరర్స్ లిస్ట్ లో అసొం, చత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. మరో వైపు..ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ విభాగంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిలిచాయి. వీటిలో ఢిల్లీ, పుదిచ్ఛేరి, త్రిపుర ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి.

 

కాగా ఏపి సర్కార్ పెట్టుబడులు ఆకర్షించేందుకు సరికొత్త పాలసీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పారిశ్రామిక వేత్తలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తొంది. అదే విధంగా భూకేటాయింపులు, ఇతర సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా కల్పిస్తొంది. ఈ కారణంగా పెట్టుబడిదారులకు అనువైన రాష్ట్రంలో ఏపి ఉందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇటీవల సీఎం జగన్ దావోస్ పర్యటన లో రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయులు కుదిరాయి. ఒక్క గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ లోనే లక్ష కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. అదే విధంగా ప్రముఖ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ సీఈవో తోనూ దావోస్ లో సీఎం జగన్ భేటీ అయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే ఏపిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు బైజూస్ కంటెంట్ అందించేందుకు ఒప్పందం చేసుకోవడం విశేషం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N