Visakhapatnam: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విశాఖ పర్యటనలో ఉన్నారు. శనివారం అక్కడి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తో కలిసి ఓ ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ నందు అక్రిడేటెడ్ జర్నలిస్టులకు హెల్త్ క్యాంపు ప్రారంభించేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో మంత్రి ఉన్న లిఫ్ట్ ఒక్క సారిగా ఆగిపోయింది.

ఎమి జరిగిందో తెలియక అందరూ ఆందోళనకు గురైయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఎమర్జెన్సీ కీ తో లిఫ్ట్ డోర్ తెరిచి మంత్రి రజిని, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులను బయటకు తీసుకువచ్చారు. లిఫ్ట్ లో పరిమితికి మంచి ఎక్కడంతో లోడ్ ఎక్కువై ఆగిపోయినట్లుగా చెబుతున్నారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధికి అస్వస్థత